ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాజధాని ఢిల్లీపై శశిథరూర్ సూటి ప్రశ్న..

ABN, Publish Date - Nov 19 , 2024 | 09:25 PM

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్రతరమైంది. అది రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారింది ఢిల్లీ.

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత తీవ్రతరమైంది. అది రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మారింది ఢిల్లీ. దీనికితోడు పొగమంచు కప్పేయడంతో గాలి నాణ్యత సూచీ అత్యంత తీవ్రస్థాయికి పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీని దేశ రాజధానిగా కొనసాగించాలా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. నగరంలో ప్రమాదకర కాలుష్య కారకాలు నాలుగు రెట్లు పెరిగాయని, రెండో అత్యంత కాలుష్య నగరం ఢాకాతో పోలిస్తే.. ఢిల్లీలో ప్రమాదస్థాయి ఐదు రెట్లు ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. ఇలాంటి విపత్కర పరస్థితిని కొన్నేళ్లుగా చూస్తున్నా.. కేంద్రం మాత్రం దీని గురించి పట్టించుకోవడం లేదని శశిథరూర్ అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీని తరచూ పొగమంచు కమ్మేస్తోంది. దీంతో గాలి నాణ్యతా సూచీ AQI 494 కు పడిపోయింది. చాలా ప్రాంతాల్లో ఇది 500 మార్కును దాటేసింది.

Updated Date - Nov 19 , 2024 | 09:25 PM