వరద రహిత నగరంగా అమరావతి
ABN, Publish Date - Nov 10 , 2024 | 01:54 PM
అమరావతి రాజధాతిని శాశ్వత వరద రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు వీలుగా సీఆర్‌డీఏ కీలక నిర్ణయం తీసుకుంది.. వరద నిర్వహణ డిజైన్లకు సీఆర్‌డీఏ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో వరద నిర్వహణ పనులకు రూ. 2062 కోట్ల అంచనా వ్య యంతో డిజైన్లను ఆమోదించింది.
విజయవాడ: వరద రహిత నగరంగా అమరావతి.. ఇక అమరావతిలో వరద కష్టాలు ఉండవు. వరద నిర్వాహణ డిజైన్‌పై ఆమోదముద్ర పడింది. వందేళ్ల వర్షపాతాన్ని పరిశీలించి నివేదిక ఇచ్చారు. టాటా కన్సాల్టింగ్ సంస్థ, ఇంజనీర్లు, నెదర్లాండ్ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రణాళిక రూపొందించారు. అలాగే అమరావతిలో ప్రవహిస్తున్న వాగులను విస్తరించాలని నిర్ణియించారు. కొండవీటి, పాలవాగులలోతు, వెడల్పు పెంచాలని సీఆర్డీయే నిర్ణయించింది. ఈ వరద నిర్వహణ పనులకు రూ. 2,062 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.
దుర్భేద్య అమరావతి దిశగా వడిగా అడుగులు పడుతున్నాయి. అమరావతి రాజధాతిని శాశ్వత వరద రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు వీలుగా సీఆర్‌డీఏ కీలక నిర్ణయం తీసుకుంది.. వరద నిర్వహణ డిజైన్లకు సీఆర్‌డీఏ ఆమోదముద్ర వేసింది. అమరావతిలో వరద నిర్వహణ పనులకు రూ. 2062 కోట్ల అంచనా వ్య యంతో డిజైన్లను ఆమోదించింది. వరద నిర్వహణ చర్యలలో భాగంగా రాజధానిలోని కొండవీడు వాగు, పాలవాగుల లోతు పెంచటంతో పాటు, వెడ ల్పు కూడా పెంచేందుకు వీలుగా డిజైన్లను రూపొందించటం జరిగింది. ఈ డిజైన్లను నెదర్లాండ్స్ సంస్థ ఆర్కాడిస్ రూపొందించగా.. టాటా కన్సల్టెంగ్ ఇంజనీర్లు కూడా ప్రముఖ పాత్ర పోషించారు. వరద నిర్వహణ ప్రణాళికకు సంబంధించిన సమగ్ర నివేదికను కూడా నెదర్లాండ్స్ సంస్థ అందిం చింది. టెక్నికల్ కమిటీ ఆమోదం కూడా దీనికి లభించింది.
గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 2015 - 19 లోనే దీనికి అడుగులు పడ్డాయి. అప్ప ట్లో 100 సంవత్సరాల వర్షపాతాన్ని ప్రామాణికంగా తీసుకోవటం జరిగింది. ఇరవై నాలుగు గంటల వర్ష పాతం 222 మిల్లీమీటర్లను పరిగణనలోకి తీసుకున్నారు. భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుని ఈ విలువను చాలా ఎక్కువుగానే అప్పట్లో తీసుకున్నారు. అప్పట్లోనే కొండవీటి వాగు, పాలవాగుల వెడల్పు, లోతులను పెంచి విస్తరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా పంపింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రణా ళికలు రూపొందించింది. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కూడా అప్పట్లో ఈ ప్రతిపా దనలను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ కూడా వరద నిర్వహణ ప్రణాళికలను సమీక్షించి ఆమోదించింది. ఈ పనులు చేపట్టే క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధాని విధ్వంసానికి పాల్పడింది. కిందటి ఐదేళ్ళు వైసీపీ ప్రభుత్వం అమరావతి రాజధానిని దశల వారీగా కూకటివేళ్ళతో సహా పెకిలించివేసింది. అమరావతి వరద ప్రణాళికలను అప్పుడే వైసీపీ ప్రభుత్వం అమలు చేసి ఉంటే ప్రస్తుతం ఆర్థిక భారం పడేది కాదు. ప్రస్తుత ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం చూస్తే 25 - 30 శాతం మేర పెరిగిపోయింది. దీంతో అన్ని పన్నులతో కలిపి చూస్తే రూ. 2062.78 కోట్ల వ్యయం అవుతోంది.
Updated at - Nov 10 , 2024 | 01:54 PM