సోషల్ మీడియా సైకోలకు చంద్రబాబు వార్నింగ్..
ABN, Publish Date - Nov 09 , 2024 | 09:17 PM
సోషల్ మీడియా(Social Media) సైకోలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వార్నింగ్ ఇచ్చారు. ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
విజయవాడ: సోషల్ మీడియా (Social Media) సైకోలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వార్నింగ్ ఇచ్చారు. ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై పోస్టులు పెట్టినా వదిలేది లేదని స్పష్టం చేశారు. రాజకీయ నేతల ముసుగులో ఉన్న నేరస్థులను విడిచిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. "మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది. ఆడబిడ్డల జోలికి వచ్చినా, వారి క్యారెక్టర్ గురించి మాట్లాడినా తీవ్రమైన చర్యలు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ ఎవ్వరికీ భయపడదనే విషయాన్ని పోస్టులు పెట్టేవారు గుర్తుపెట్టుకోవాలి. మీ చెల్లెళ్లు, అక్కలు, తల్లులపై మీకు గౌరవం లేకపోవచ్చు, కానీ మాకు ఉంది. వైసీపీ నేతల భార్యలు, కూతుళ్లపై పోస్టులు పెట్టినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మనుషులు మనషుల్లాగా ఉండాలి, మృగాలుగా మారకూడదు. మీరు మృగాలుగా ఉంటే మిమ్మల్ని ఎలా కట్టిడి చేయాలో అలానే చేస్తాం" అంటూ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు
Borugadda Anil: పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్
Sanju Samson: సంజూ సక్సెస్ వెనుక సూపర్ పవర్.. చెప్పి మరీ కొట్టించాడు
Read Latest AP News And Telangana News
Updated at - Nov 09 , 2024 | 09:18 PM