12 ఏళ్ల తర్వాత భాను కిరణ్ విడుదల..
ABN, Publish Date - Nov 06 , 2024 | 08:26 PM
మద్దిలచెరువు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. 12 ఏళ్ల అనంతరం అతడు జైలు నుంచి బయటకు వచ్చారు. ఇటీవల నాంపల్లి కోర్టు భాను కిరణ్‌కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బుధవారం జైలు నుంచి భానుకిరణ్ విడుదలయ్యారు.

సూరి హత్య కేసులో భానుకిరణ్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతో 12 సంవత్సరాలుగా అతడు చంచల్ గూడ జైలులోనే ఉన్నారు. అయితే తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ గత కొన్ని సంవత్సరాలుగా కోర్టులను ఆశ్రయిస్తూ వస్తున్నారు. అందులోభాగంగా భాను కిరణ్ సుప్రీంకోర్టు, హైకోర్టును సైతం ఆశ్రయించారు. అయితే బెయిల్‌పై స్థానిక కోర్టులోనే తేల్చుకోవాలంటూ సుప్రీం కోర్టు.. భానుకిరణ్‌కు స్పష్టం చేసింది. దీంతో అతడు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Nov 06 , 2024 | 08:40 PM