సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసు నమోదు..
ABN, Publish Date - Nov 10 , 2024 | 12:23 PM
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సూత్రధారి, పాత్రధారి, ఇన్చార్జ్ అయిన సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు అర్జున్ రెడ్డి, వర్ర రవీందర్ రెడ్డి.. ముగ్గురుపై కేసు నమోదు అయింది. ఇంత వరకు తప్పించుకుని తిరుగుతున్న భార్గవ్.. ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నీచ వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వారు దారికి వస్తున్నారు.
కడప : జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా రెచ్చిపోయిన వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మూకలపై పోలీసులు ఉక్కుపా దం మోపుతున్నారు. తాజాగా వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆయనపై పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సోషల్ మీడియా పోస్టుల్లో తనను కులం పేరుతో దూషించారని సింహాద్రిపురం మండలానికి చెందిన దళితుడైన హరి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో సజ్జల భార్గవ్ మరో ఇద్దరిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.
వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా సూత్రధారి, పాత్రధారి, ఇన్చార్జ్ అయిన సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు అర్జున్ రెడ్డి, వర్ర రవీందర్ రెడ్డి.. ముగ్గురుపై కేసు నమోదు అయింది. ఇంత వరకు తప్పించుకుని తిరుగుతున్న భార్గవ్.. ఇప్పుడు వెలుగులోకి వచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో నీచ వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వారు దారికి వస్తున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆక్రోశం... ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో సోషల్ సైకోలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. వారు పెట్టిన పోస్టులను బట్టి... నోటీసులు ఇవ్వడం, కౌన్సెలింగ్ చేయడం, కేసులు పెట్టడం, అవసరమైన చోట అరెస్టులూ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
యమునా నదిపై దట్టంగా విషపు నురుగు..
విధ్వంసం సృష్టించి విజయోత్సవాలా..: కేటీఆర్
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా విజయోత్సవాలు..
రక్షణ కోరుతున్న వైసీపీ సైకోలు..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 10 , 2024 | 12:24 PM