కొండా సురేఖపై పరువు నష్టం దావా..కోర్టుకు కేటీఆర్

ABN, Publish Date - Oct 23 , 2024 | 08:58 PM

తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన పరువు, ప్రతిష్ట దెబ్బ తీసే విధంగా మాట్లాడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం నాంపల్లి కోర్టుకు తెలిపారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై క్రమినల్ చర్యలు తీసుకోవాలని నాంపల్లి ప్రత్యేక కోర్టును ఈ సందర్బంగా కేటీఆర్ అభ్యర్థించారు. ఈ సందర్బంగా కేటీఆర్ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది.

హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల విడాకులకు కేటీఆర్ కారణమంటూ మంత్రి కొండా సురేఖ మీడియా ఎదుట వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై టాలీవుడ్ సైతం స్పందించింది. వాటిని ఖండించింది. ఇటువంటి పరిస్థితుల్లో కేటీఆర్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దాంతో ఆయన నాంపల్లి ప్రత్యేక కోర్టులో కొండా సురేఖపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఆ క్రమంలో బుధవారం నాంపల్లి ప్రత్యేక కోర్టుకు హాజరై కేటీఆర్ తవ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆ క్రమంలో గత 18 ఏళ్లుగా తాను రాజకీయ జీవితంలో ఉన్నానన్నారు. అయితే ఆమె.. తన మాటలతో తానను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Oct 23 , 2024 | 08:58 PM