అసెంబ్లీ కి నేను రాను..పిల్లాడిలా మారం చేస్తున్న జగన్
ABN, Publish Date - Nov 10 , 2024 | 09:23 PM
అంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు రేపు అంటే సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ సమావేశాలకు హాజరు కావడం లేదని వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. తమ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పించడం లేదు కనుక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు తాము రాకున్నా.. తన నివాసంలోని మీడియా పాయింట్ నుంచి ప్రభుత్వంపై విమర్శులు సంధిస్తామని వైఎస్ జగన్ ప్రకటించారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. అయితే గతంలో అధికారం చేపట్టిన వైఎస్ఆర్ సీపీకి ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. కానీ ప్రతిపక్ష హోదా దక్కాలంటే.. కనీసం 18 సీట్లు అయినా రావాల్సి ఉంది.
కానీ ఆ మార్క్‌కు వైసీపీ చేరుకో లేక పోయింది. అయినా.. తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ను మాజీ సీఎం వైఎస్ జగన్ కోరారు. ఎమ్మెల్యే సంఖ్య బలం లేకుంటే.. ఆ హోదా దక్కదని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుంటే తమ పదవులకు రాజీనామా చేయాలంటూ టీపీసీసీ చీఫ్, వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల వైసీపీ ఎమ్మెల్యేలను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 10 , 2024 | 09:23 PM