చంద్రబాబు అరెస్టుపై అసెంబ్లీలో చర్చ..

ABN, Publish Date - Nov 19 , 2024 | 09:47 PM

వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబుపై చేసిన కుట్ర గురించి అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబుపై జరిగిన కుట్రపై సోమవారం రాత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ నిర్వహించిన డిబెట్‌లో రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంటర్నెట్ డెస్క్: వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబుపై చేసిన కుట్ర గురించి అసెంబ్లీలో కూటమి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రస్తావించారు. చంద్రబాబుపై జరిగిన కుట్రపై సోమవారం రాత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వెంకటకృష్ణ నిర్వహించిన డిబెట్‌లో రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పీవీ రమేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి సీఎంవో, సీఐడీ, స్కిల్ అధికారులు కలిసి కీలక ఫైళ్లు మాయం చేశారని తెలిపారు. అయితే ఈ విషయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జీవో అవర్‪లో ప్రస్తావించారు. సభా నాయకుడికి వ్యతిరేకంగా జరిగిన కుట్రను ఛేదించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సీఎం చంద్రబాబుకే అలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడిని జైల్లోకి నెట్టేందుకు అప్పటి సీఎం జగన్ కుట్ర చేశారని, మూడు చోట్ల ఏకకాలంలో ఫైళ్లు మాయం చేయడం కుట్రలో భాగమేనని పీవీ రమేశ్ డిబెట్‌లో వివరించారు. నిధుల విడుదలకు సంబంధించి సీఎం ఆదేశించినట్లు, తాను స్టేట్మెంట్ ఇచ్చినట్లు తప్పుడు సమాచారం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిందని పీవీ రమేశ్ తెలిపారు.

Updated at - Nov 19 , 2024 | 09:49 PM