పాదయాత్రనా.. పదవుల యాత్రనా?.. కేటీఆర్ కు ఎంపీ అరవింద్ కౌంటర్

ABN, Publish Date - Nov 03 , 2024 | 04:09 PM

తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలతోపాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపూరీ అర్వింద్ నిప్పులు చెరిగారు. ఆదివారం నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ ధర్మపూరి అర్వింద్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు.

తెలంగాణలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలతోపాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపూరీ అర్వింద్ నిప్పులు చెరిగారు. ఆదివారం నిజామాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీ ధర్మపూరి అర్వింద్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఓటమి తప్పదని ఆయన జోస్యం చెప్పారు. ఇక పాదయాత్ర చేస్తానని ప్రకటించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై వ్యంగ్య బాణాలు సంధించారు. ఈ యాత్ర.. పాదయాత్రా లేకుంటే పదవుల యాత్రా అని ప్రశ్నించారు. ఈ రెండింటిలో ఏ యాత్రాలో స్పష్టం చేయాలని కేటీఆర్‌ను ధర్మపూరి అర్వింద్ డిమాండ్ చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 03 , 2024 | 04:09 PM