Rahul Gandhi: కుల గణనపై మేధావులు, పౌర హక్కుల నేతలతో చర్చ
ABN , Publish Date - Nov 05 , 2024 | 05:50 PM
తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే కుల గణన సమావేశానికి రాహుల్ గాంధీ విచ్చేశారు. బేగంపేట విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మీ స్వాగతం పలికారు.
హైదరాబాద్: మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బిజీగా ఉన్నారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే కుల గణన సమావేశానికి రాహుల్ గాంధీ విచ్చేశారు. బేగంపేట ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మీ స్వాగతం పలికారు. బోయిన్ పల్లిలో గల గాంధీ ఐడియాలజీ కేంద్రంలో కుల గణనకు సంబంధించి పౌరహక్కులు నేతలు, మేధావులతో రాహుల్ గాంధీ చర్చిస్తారు.