Share News

Speaker Ayanna patrudu: ఇవ్వాళన్నా రండి

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:25 AM

శాసన సభ గురువారం నిరవధికంగా వాయిదా పడిన తరువాత సభ నుంచి బయటకు వస్తున్న స్పీకర్‌ అయ్యన్న, మంత్రి లోకేశ్‌ మధ్య సరదా సంభాషణ జరిగింది.

Speaker Ayanna patrudu:  ఇవ్వాళన్నా రండి

స్పీకర్‌ ఆదేశాలు పాటిస్తా అయ్యన్న, లోకేశ్‌ సరదా సంభాషణ

AP Assembly Speaker: శాసన సభ గురువారం నిరవధికంగా వాయిదా పడిన తరువాత సభ నుంచి బయటకు వస్తున్న స్పీకర్‌ అయ్యన్న, మంత్రి లోకేశ్‌ మధ్య సరదా సంభాషణ జరిగింది. తన ముందు వెళ్తున్న మంత్రిని అయ్యన్న పిలిచారు. ‘ఎమ్మెల్యేల క్రీడా పోటీలకు గైర్హాజరయ్యారు. ఈరోజు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలకైనా తప్పకుండా రండి’ అని లోకేశ్‌ను కోరారు. స్పీకర్‌ ఆదేశాలు తప్పక పాటిస్తామని మంత్రి సరదాగా అన్నారు. ‘నేనిక సెలవు తీసుకుంటా’ అన్న స్పీకర్‌తో... నేనూ వస్తానంటూ లోకేశ్‌ వెళ్లి.. కారు డోర్‌ తీసి అయ్యన్నను సీటులో కూర్చోపెట్టి వీడ్కోలు పలికారు.

Updated Date - Mar 21 , 2025 | 05:26 AM