Share News

Gold and Silver Prices: ఉలిక్కి పడేలా చేస్తున్న బంగారం, వెండి ధరలు.. రోజు రోజుకూ..

ABN , Publish Date - Mar 20 , 2025 | 06:45 AM

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గినప్పటికీ గతేడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతూ వస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత పసిడి ధర ఉట్టెక్కింది.

Gold and Silver Prices: ఉలిక్కి పడేలా చేస్తున్న బంగారం, వెండి ధరలు.. రోజు రోజుకూ..
Gold and Silver Prices

బిజినెస్ న్యూస్: బుధవారం జీవిత కాల గరిష్ఠానికి చేరిన బంగారం ధర గురువారం (20-03-2025) రోజు స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో నిన్న 10 గ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.90 వేలకు పెరిగి కొనుగోలు దారులకు భారీ షాక్ ఇచ్చింది. అయితే ఇవాళ ఉదయం 06:30 గంటల సమయానికి దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,660 ఉండగా.. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.81,272గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.88,820 కాగా.. 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.81,418గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.88,960 చేరుకోగా.. 22 క్యారెట్ల తులం పసిడి రేటు రూ.81,547గా ఉంది.


బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గినప్పటికీ గతేడాదితో పోలిస్తే భారీగానే పెరుగుతూ వస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత పసిడి ధర ఉట్టెక్కింది. ఆయన తీసుకుంటున్న వరస సంచలన నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లు బెంబేలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మదుపరులంతా గోల్డ్‌ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. తాజాగా ట్రంప్ తీసుకున్న మరో నిర్ణయం బంగారానికి డిమాండ్ భారీగా పెంచింది. దిగుమతి సుంకాలను ట్రంప్ భారీగా పెంచారు. దీంతో పెట్టుబడుదారులంతా ఒక్కసారిగా పసిడి వైపు మెుగ్గు చూపడంతో రేటు అమాంతం పెరిగిపోయింది.


దేశవ్యాప్తంగా బంగారం (22, 24 క్యారెట్ల) ధరలు ఎలా ఉన్నాయంటే..

  • కోల్‌కతా- రూ.81,308, రూ.88,700

  • చెన్నై- రూ.81,648, రూ.89,070

  • బెంగళూరు- రూ.81,483, రూ.88,890

  • పుణె- రూ.81,418, రూ.88,820

  • అహ్మదాబాద్- రూ.81,519, రూ.88,930

  • భోపాల్- రూ.81,501, రూ.88,910

  • కోయంబత్తూర్- రూ.81,648, రూ.89,070

  • పట్నా- రూ.81,373, రూ.88,770

  • సూరత్- రూ.81,519, రూ.88,930

  • పుదుచ్చెరి- రూ.81,703, రూ.89,130


వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.99,790కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో కేజీ రేటు రూ.99,960గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి రికార్డు ధర పలుకుతోంది. ఏకంగా రూ.లక్ష దాటి రూ.100,120 వద్ద కొనసాగుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

ఉక్కు దిగుమతులపై 12% సుంకం!

అమెరికాలో వడ్డీరేట్లు యథాతథం

Updated Date - Mar 20 , 2025 | 07:10 AM