Share News

Stock Market: ఒక్క రోజే రూ. 12 లక్షల కోట్లు ఆవిరి.. కారణమిదే..

ABN , Publish Date - Jan 06 , 2025 | 04:59 PM

చైనా HMPV వైరస్ కేసులు భారతీయ రాష్ట్రాల్లో సోకిన తర్వాత సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలు మొత్తం పడిపోయాయి. దీంతో పెట్టుబడిదారులు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు.

Stock Market: ఒక్క రోజే రూ. 12 లక్షల కోట్లు ఆవిరి.. కారణమిదే..
Investors Lose 12 Lakh Crore

అమెరికన్ స్టాక్ మార్కెట్లలో పెరుగుదల ఉన్నప్పటికీ, భారతీయ స్టాక్ మార్కెట్ (StockMarket) సూచీలు మాత్రం సోమవారం (జనవరి 6న) భారీ నష్టాలతో ముగిశాయి. దేశంలో హ్యూమన్ మెటాప్‌న్యూమో వైరస్ (HMPV) కేసులు రెండు నమోదైన తర్వాత మార్కెట్‌లో విస్తృతంగా అమ్మకాలు జరిగాయి. ఈ క్రమంలో కొన్ని ఒడిదుడుకుల తర్వాత మార్కెట్ మొత్తం ఎరుపు రంగులోకి జారిపోయింది. చివరకు సెన్సెక్స్ 1258 పాయింట్ల పతనంతో 77,964.99 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 50 కూడా భారీ అమ్మకాల తర్వాత 24,700 దిగువకు పడిపోయింది. చివరగా నిఫ్టీ 388.70 పాయింట్ల భారీ పతనంతో 23,616.05 వద్దకు చేరుకుంది.


ఒక్క రోజులోనే..

దీంతో మదుపర్లు ఒక్క రోజులోనే దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలను నష్టపోయారు. స్టాక్ మార్కెట్‌లో ఆల్ రౌండ్ అమ్మకాల కారణంగా ఇన్వెస్టర్లు రూ.12 లక్షల కోట్లకు పైగా తగ్గింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాప్ (ఎంక్యాప్) రూ.12,38,638 కోట్లు తగ్గి రూ.4,38,95,210 లక్షల కోట్లకు చేరింది. శుక్రవారం ఇది రూ.45,133,848 కోట్లుగా ఉండేది. ఈ క్రమంలో సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో సన్‌ఫార్మా, టైటాన్‌ మినహా అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. టాటా స్టీల్ షేర్లు అత్యధికంగా 4 శాతానికి పైగా పడిపోయాయి.


రూపాయి విలువ కూడా..

కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ తదితర షేర్లు కూడా క్షీణించాయి. టాటా స్టీల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కోటక్ బ్యాంక్, టాటా మోటార్స్, ఐటీసీ వంటి హెవీవెయిట్ స్టాక్‌లలో అమ్మకాలు మార్కెట్‌ను దిగువకు లాగాయని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ పోల్చుకుంటే ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి చేరుకుంది. సోమవారం (జనవరి 6) అమెరికా కరెన్సీతో రూపాయి మారకం విలువ రూ.85.82కి పడిపోయింది. ఇది ఆల్ టైమ్ కనిష్ట స్థాయి.


ఇతర మార్కెట్లు ఎలా ఉన్నాయంటే..

ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన కోస్పి లాభాల్లో ఉండగా, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్, జపాన్‌కు చెందిన నిక్కీ నష్టాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియాకు చెందిన కోస్పి లాభాల్లో ఉండగా, చైనాకు చెందిన షాంఘై కాంపోజిట్, హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్, జపాన్‌కు చెందిన నిక్కీ నష్టాల్లో ఉన్నాయి. శుక్రవారం అమెరికా మార్కెట్లు సానుకూలంగా ముగిశాయి. BSE సెన్సెక్స్ శుక్రవారం (జనవరి 3) 720.60 పాయింట్లు క్షీణించి 79,223.11 వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ-50 183.90 పాయింట్లు పడిపోయి 24,004.75 వద్ద ముగిసింది. ఈ విధంగా సెన్సెక్స్ గత రెండు రోజుల్లో దాదాపు 2000 పాయింట్లు పడిపోయింది.


ఇవి కూడా చదవండి:

Viral News: వేల కోట్ల రూపాయలు సంపాదించా.. కానీ ఏం చేయాలో అర్థం కావట్లే..

Investment Tips: సిప్ పెట్టుబడుల మ్యాజిక్.. ఇలా రూ. 7 కోట్లు పొందండి..

Viral News: ఈ భారత సీఈవో జీతం రోజుకు రూ. 48 కోట్లు.. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ కాదు..


Bima Sakhi Yojana: బీమా సఖి యోజన స్కీం ఇలా అప్లై చేయండి.. నెలకు రూ.7 వేలు పొందండి..

Piyush Goyal: ఈవీలకు సబ్సిడీలు అవసరం లేదు.. వారే స్వయంగా చెప్పారు


Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 06 , 2025 | 05:05 PM