Rolls-Royce 2,500 మంది ఉద్యోగుల్ని తొలగించిన రోల్స్ రాయిస్
ABN , Publish Date - Mar 26 , 2025 | 12:34 PM
'రోల్స్ రాయిస్' సంస్థ రెండేళ్ల ముందుగానే లాభాల లక్ష్యాలను చేరుకుంది. గడచిన రెండేళ్లలో ఆ కంపెనీ మార్కెట్ విలువకు $70 బిలియన్లకు పైగా పెరిగడం ఒక విశేషం.

'రోల్స్ రాయిస్'ప్రముఖ బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ. నిర్ణయించుకున్న కాలపరిమితికి రెండేళ్ల ముందుగానే లాభాల లక్ష్యాలను చేరుకుంది. గడచిన రెండేళ్లలలో ఆ కంపెనీ మార్కెట్ విలువకు $70 బిలియన్లకు పైగా పెరిగడం ఒక విశేషం. అయితే, గడిచిన ఏడాది కాలంలో ఈ ప్రఖ్యాత సంస్థ 2,500 మందిని ఉద్యోగాల్లోంచి తొలగించింది. వీరిలో ఎక్కువ మంది మేనేజర్ స్థాయి ఉద్యోగులేనని తాజాగ విడుదలైన ఫార్చ్యూన్ రిపోర్ట్ తెలియచేస్తోంది.
రోల్స్ రాయిస్ కంపెనీ సీఈవోగా టుఫాన్ ఎర్గిన్‌బిలిక్ బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో అనూహ్య పరిణామాలకు కారణమయ్యారు. అందులో భాగంగా కొందరు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించడంతోపాటు సంస్థ షేరు ధర ఏకంగా 500 శాతం ఎగబాకి సరికొత్త రికార్డు నెలకొల్పేందుకు కారణమయ్యారు.
రోల్స్ రాయిస్ సంస్థ ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉద్యోగులకు స్పష్టంగా తెలియజేశామని, దీంతో కంపెనీలోని 42,000 మంది ఉద్యోగులు అప్రమత్తులై పనిచేశారని కంపెనీ సీఈవో ఎర్గిన్‌బిలిక్ చెప్పారు. రోల్స్ రాయిస్ ఒక బర్నింగ్ ప్లాట్‌ఫామ్‌గా తీర్చి దిద్దేందుకు 500 వందల మంది ఉద్యోగులకు వర్క్‌షాప్‌లు కూడా నిర్వహించామని ఆయన చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మాజీ మంత్రి కొడాలి నానికి అస్వస్థత
రుయా సెంట్రల్ ల్యాబ్‌లో లైంగిక వేధింపులు
ఏపీ మద్యం స్కాంపై అమిత్ షా ఆరా
For More AP News and Telugu News