Auto Index: ట్రంప్ టారిఫ్స్ దెబ్బకు షాక్ తిన్న నిఫ్టీ ఆటో ఇండెక్స్
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:08 PM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొత్తగా తెచ్చిన టారిఫ్‌లతో గురువారం నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2 శాతం పతనం కాగా, టాటా మోటార్స్ 6 శాతం డౌనైంది.

Stock Market Updates: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజా టారిఫ్ ప్రకటనల నేపథ్యం భారత స్టాక్ మార్కెట్లపై పెద్ద ప్రభావమే చూపిస్తోంది. ఇవాళ గురువారం నిఫ్టీ ఆటో ఇండెక్స్ 2% వరకు పడిపోయింది. టాటా మోటార్స్ బిగ్ లాస్ ను చవిచూసింది. సదరు కంపెనీ షేర్ ధర ఏకంగా 6శాతం తగ్గిపోయింది. అటు, అమెరికా ఈక్విటీ మార్కెట్లు సైతం నిన్న భారీ తగ్గుదలను ఎదుర్కోవాల్సి వచ్చింది.
విదేశాల్లో తయారై అమెరికాకు దిగుమతయ్యే కార్లపై 25 శాతం సుంకం (Tariffs) విధిస్తున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు. అంతేకాదు,ఈ మార్పులు వచ్చేవారం నుంచే అమల్లోకి వస్తాయని తేల్చి చెప్పారు. ఫలితంగా ఏప్రిల్ 2 నుండి అమెరికా దిగుమతి చేసుకునే కార్లపై 25% టారిఫ్ విధానం అమల్లోకి వస్తుంది. ఇందులో ఎటువంటి మార్పులు ఉండవని కూడా ట్రంప్ స్పష్టంగా పేర్కొన్నారు.
అయితే, అమెరికాలో తయారయ్యే కార్లపై ఎలాంటి సుంకం ఉండదన్నారు ట్రంప్. ఈ చర్య యూఎస్ ఆర్థిక వృద్ధికి మేలు చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం ప్రధానంగా జాగ్వార్ ల్యాండ్ రోవర్(jaguar land rover) మాతృ సంస్థ అయిన టాటా మోటార్స్ షేర్లపై భారీగా ప్రభావం చూపింది. ల్యాండ్ రోవర్ కార్ల మొత్తం అమ్మకాలలో అమెరికా 22% వాటాను కలిగి ఉండటమే దీనికి కారణం.
ఇవి కూడా చదవండి:
Stock Market Update: లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్ సూచీలు
SEBI: ఆప్షన్ ట్రేడింగ్ అక్కడే కొంప ముంచుతోంది : సెబీ ఛైర్మన్
454 చెట్లను నరికించిన వ్యక్తికి 4.54 కోట్ల ఫైన్
భారత్‌ను స్ఫూర్తిగా తీసుకుందాం