విదేశీ భాషా కోర్సులు ఇక్కడ చదవొచ్చు
ABN , Publish Date - Mar 10 , 2025 | 03:56 AM
భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణకు సంబంధించిన సాధనం మాత్రమే కాదు. ఆధునిక కాలంలో అది కెరీర్ కూడా. మాతృభాషతోపాటు విదేశీ భాషలు నేర్చుకుని అద్భుతమైన కెరీర్ సొంతం చేసుకోవచ్చు....
భాష అనేది కేవలం భావ వ్యక్తీకరణకు సంబంధించిన సాధనం మాత్రమే కాదు. ఆధునిక కాలంలో అది కెరీర్ కూడా. మాతృభాషతోపాటు విదేశీ భాషలు నేర్చుకుని అద్భుతమైన కెరీర్ సొంతం చేసుకోవచ్చు. ఎన్ని ఎక్కువ భాషలు వస్తే అన్ని అవకాశాలు పెరుగుతాయి కూడా. భారతదేశంలో విదేశీ భాషలను ప్రైవేటు సంస్థలతోపాటు పలు ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా అందిస్తున్నాయి. ఇందులో బిగినర్ కోర్సులు, ఇంటర్మీడియెట్ కోర్సులు, అడ్వాన్స్‌డ్ కోర్సులు, స్పెషలైజ్డ్ కోర్సులు ఉంటాయి. బిగినర్ కోర్సులు కొంత ప్రాథమిక పరిజ్ఞానాన్ని అందిస్తే ఇంటర్మీడియెట్ కోర్సులు భాషా పరిజ్ఞానాన్ని పెంచుతాయి. అడ్వాన్స్‌డ్, స్పెషలైజ్డ్ కోర్సులు అయితే కెరీర్‌కు కావాల్సిన భాషా సంపదను కలిగిస్తాయి. మన దేశంలో భాషకు సంబంధించి కోర్సులు అందించే ప్రభుత్వ వర్సిటీల్లో కొన్ని....
ఢిల్లీ యూనివర్సిటీ: ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, ఇటాలియన్, పర్షియన్, మోడరల్ అరబిక్, పాలీ, టిబెటన్ భాషా - సాహిత్యంలో సర్టిఫికెట్ కోర్సులను అందిస్తోంది. ఇంటర్ పూర్తి చేసిన వారు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. https://www.du.ac.in/
బనారస్ హిందూ యూనివర్సిటీ: పలు విదేశీ భాషలకు సంబంధించిన డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను బనారస్ హిందూ యూనివర్సిటీ అందిస్తోంది. ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్, చైనీస్ భాషలు ఇందులో ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. https://www.bhu.ac.in/
గురునానక్‌దేవ్ యూనివర్సిటీ, అమృత్‌సర్: ఈ వర్సిటీలో ఫ్రెంచ్‌లో ఫుల్‌టైమ్ డిప్లొమాలు, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, రష్యన్ భాషల్లో పార్ట్‌టైమ్ డిప్లొమాలు ఉన్నాయి. అంతేకాకుండా ఫ్రెంచ్‌లో పార్ట్‌టైమ్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా కూడా అందుబాటులో ఉంది. వీటికి దరఖాస్తు చేయడానికి ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. https://www.gndu.ac.in/
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ: భాషలకు సంబంధించిన పలు కోర్సులను ఈ యూనివర్సిటీ అందిస్తుంది. జర్మన్, రష్యన్, స్పానిష్, జపనీస్, కొరియన్, చైనీస్ తదితర భాషలకు సంబంధించిన యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులు ఇక్కడ ఉన్నాయి. www.jnu.ac.in/main/
సీఫెల్, హైదరాబాద్: హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలో ఉన్న ‘సీఫెల్’ పలు యూరోపియన్ భాషలకు సంబంధించిన కోర్సులను అందిస్తుంది. ఇందులో ఫ్రెంచ్, ఫ్రాన్సోఫోన్ స్టడీస్, జర్మనిక్ స్టడీస్, హిస్పానిక్ స్టడీస్, లాటిన్, రష్యన్‌కు స్టడీస్ తదితరాలపై పలు కోర్సులు ఉన్నాయి. https://www.efluniversity.ac.in
Read Also : Business Ideas: రోజులో రెండు గంటలు ఈ పనిచేస్తే చాలు.. మహిళలకు ఇంటి ..
Business Plan : డబ్బుకు డబ్బు.. ఇంట్లోనే పని.. మహిళల కోసం బెస్ట్ ...
Business Ideas: పీఎం మోడీ చెప్పిన ఈ పంటకు పెట్టుబడి రూ.20వేలు ...