Viral: ఏఐతో లైఫ్ ఇంత ఈజీనా! ఒక్క రాత్రిలో వెయ్యి ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తే..
ABN , Publish Date - Jan 09 , 2025 | 08:31 PM
కృత్రిమే మేథ ఆధారిత బాట్‌తో ఏకంగా 1000 జాబ్స్‌కు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఏకంగా 50 సంస్థల నుంచి ఇంటర్వ్యూ పిలుపును అందుకున్నట్టు చెప్పారు. రెడిట్‌లో పంచుకున్న ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: కృత్రిమే మేథ ఆధారిత చాట్ బాట్‌లు అందుబాటులోకి వచ్చాక అనేక పనులు సులువుగా అయిపోతున్న విషయం తెలిసిందే. ఏఐ వినియోగంతో ఉద్యోగుల ఉత్పాదకత పెరిగిందన్న విషయం అనేక అధ్యయనాల్లో రుజువైంది. సీవీలు, రెజ్యూమేలు, కవర్ లెటర్ల వంటివన్నీ ఏఐ చాట్‌బాట్‌ల సాయంతో అద్భుత రీతిలో సిద్ధం చేసుకుని ఉద్యోగార్థులు తమ లక్ష్యాన్ని చేరుకుంటున్నారు. అయితే, వ్యక్తి ఇక్కడితో ఆగిపోకుండా మరింత ముందుకెళ్లాడు. తన బదులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసే ఓ ఏఐ బాట్‌ను రూపొందించాడు. ఆ తరువాత బాధ్యతంతా దానికి అప్పగించి మనోడు వెళ్లి నిద్రిస్తే తెల్లారేసరికల్లా ఏఐ ఏకంగా 1000 జాబ్‌లకు దరఖాస్తు చేసేసింది. ఆ తరువాత ఏం జరిగిందీ చెబుతూ అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది (Viral).
Viral: ఇన్ఫీ నారాయణ మూర్తిని మించిపోయిన ఎల్ అండ్ టీ చైర్మన్! వారానికి 90 గంటలు పనిచేయాలంటూ పిలుపు
రెడిట్‌లో సదరు వ్యక్తి ఈ విషయాలను వెల్లడించారు. తన ఎవరూ ఏం చేసేదీ మాత్రం గోప్యంగానే ఉంచుతూ ఈ విషయాలు చెప్పకొచ్చారు. తను రూపొందించిన ఏఐ బాట్ అద్భుతాలు సాధించిందని తెలిపారు. ఉద్యోగార్హతలను విశ్లేషించి, అందుకు తగిన విధంగా అప్లికేషన్లు రూపొందించి, దరఖాస్తులు కూడా చేసిందని, ఫలితంగా తనకు 50 సంస్థల నుంచి ఇంటర్వ్యూలకు పిలుపు కూడా వచ్చిందని అన్నాడు.
Tuna: మోటర్‌సైకిల్ సైజులో ఉన్న చేప వేలం.. ఏకంగా రూ.11 కోట్లకు అమ్ముడుపోయిన వైనం
ప్రస్తుతం కంపెనీలు అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలించేందుకు ఏఐ సాంకేతికతను వాడుతున్నారని సదరు వ్యక్తి చెప్పుకొచ్చారు. అయితే, తన చాట్‌బాట్ రూపొందించిన రెజ్యూమేలు సీవీలు.. కంపెనీల ఏఐ పెట్టిన పరీక్షలకు నిలిచి ఇంటర్వ్యూ దశకు ఎంపికయ్యాయని వివరించాడు. అయితే, ఈ పరిణామాలు తనను ఆలోచనలో పడేశాయని కూడా అన్నారు.
‘‘ఈ సాంకేతిక విప్లవాన్ని చూస్తుంటే.. ఉద్యోగాల తీరుతెన్నులపై పడే ప్రభావం వైపు ఆలోచన మళ్లుతోంది. ఉద్యోగ దరఖాస్తుల పరిశీలనకు సంబంధించి ఆటోమేషన్ మంచిదే గానీ ఉద్యోగుల ఎంపికలో మానవసంబంధాల ప్రాధాన్యం తగ్గేట్టు కనిపిస్తోంది. ఎంపిక ప్రక్రియనే వేగవంతం చేయాలనే ప్రయత్నంలో ‘మనిషి’ తనాన్ని దూరం చేసుకుంన్నామేమో అన్న భావన కలుగుతోంది’’ అని అతడు చెప్పుకొచ్చాడు. జనాలు కూడా ఈ ఉదంతం విని షాకైపోతున్నారు. రకరకాల వ్యాఖ్యలతో కామెంట్స్ సెక్షన్‌ను పోటెత్తిస్తున్నారు.
Viral: వేలంలో రూ.56 లక్షలకు అమ్ముడుపోయిన రూ.100 హజ్ నోటు’