సైదాబాద్ భూలక్ష్మీ మాతా ఆలయంలోకి గుర్తుతెలియని వ్యక్తి వచ్చి 'హ్యాపీ హోలీ' అంటూ అకౌంటెంట్ తలపై యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అకౌంటెంట్ నర్సింగ్ రావుకు తీవ్ర గాయాలయ్యాయి. దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు.