ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఒక భర్త తన భార్యకు మళ్లీ పెళ్లి చేశాడు. తన భార్య వివాహేతర సంబంధాన్ని అంగీకరించడమే కాకుండా, వారి ఇద్దరు పిల్లల బాధ్యతను తానే స్వయంగా తీసుకున్నాడు. తన పనుల కారణంగా, బబ్లూ తరచుగా భార్యకు దూరంగా ఉండేవాడు. ఆ సమయంలో అతని భార్య రాధిక స్థానిక యువకుడైన వికాస్‌తో సంబంధాన్ని పెంచుకుంది. ఈ వార్త యూపీలో హట్ టాపిక్‌గా మారింది.