కేరళలోని కలూరు చెందిన ఓ ప్రైవేటు మార్కెటింగ్ కంపెనీ అతి తక్కువ పనితీరు కలిగిన ఉద్యోగులపై అమానవీయంగా ప్రవర్తించింది. ఉద్యోగుల మెడకు కుక్క గొలుసులు కట్టి మోకాళ్లపై నడిపించి, నేలపై పడేసిన నాణేలను నాలుకతో తీయించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సదరు కంపెనీపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది