Silver Medal: సిమ్రన్‌ప్రీత్‌కు రజతం
ABN , Publish Date - Apr 22 , 2025 | 03:10 AM
భారత షూటర్ సిమ్రన్‌ప్రీత్ కౌర్, ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో రజత పతకం గెలుచుకుంది. ఈ విజయంలో ఆమె రెండో స్థానం సాధించింది. చైనాకు చెందిన సన్ యుజీ మరియు యావో కియాన్‌గ్జున్ స్వర్ణ మరియు కాంస్య పతకాలను అందుకున్నారు
లిమా (పెరూ): ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ల పతక జోరు సోమవారం కూడా కొనసాగింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో సిమ్రన్‌ప్రీత్ కౌర్ రెండోస్థానంలో నిలిచి రజత పతకం దక్కించుకుంది. చైనా షూటర్లు సన్ యుజీ, యావో కియాన్‌గ్జున్ స్వర్ణ, కాంస్యాలు అందుకున్నారు. భారత స్టార్ మనూ భాకర్ నాలుగోస్థానానికి పరిమితమైంది.