Share News

Apple Foldable Phone: యాపిల్ ఫోల్డబుల్ ఫోన్.. అదరగొట్టే ఫీచర్స్ ఇవేనా

ABN , Publish Date - Mar 22 , 2025 | 09:13 AM

యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ గురించి మార్కెట్లో ఎప్పటి నుంచే చర్చలు, రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. దీనిపై సంస్థ ఎటువంటి ప్రకటన చేయకపోయినా నిత్యం ఏదో వార్త టెక్ వర్గాల్లో చర్చకు దారి తీస్తుంటుంది. తాజాగా యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ ఫీచర్లపై జనాలు ఆస్తికరంగా చర్చించుకుంటున్నారు.

Apple Foldable Phone: యాపిల్ ఫోల్డబుల్ ఫోన్.. అదరగొట్టే ఫీచర్స్ ఇవేనా
Apple Foldable Phone

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ ప్రస్తుతం ఫోల్డబుల్ ఫోన్స్‌పై దృష్టి పెట్టాయి. ఈ రేసులో శాంసంగ్ ముందు వరుసలో ఉండగా యాపిల్ కూడా తనదైన దూకుడు ప్రదర్శిస్తోంది. ఫోల్డబుల్ ఫోన్‌ను మార్కెట్‌లోకి తెచ్చేందుకు యాపిల్ కూడా ప్రయత్నిస్తోందన్న వార్త ఎప్పటి నుంచో చెక్కర్లు కొడుతోంది. అయితే, ఈ ఫోన్ ఫీచర్లపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టెక్ నిపుణులు కొందరు యాపిల్ ఫోన్ ఫీచర్లు బయటపెట్టడంతో స్మార్ట్‌ఫోన్ ప్రియుల్లో ఉత్కంఠ ఒక్కసారిగా పీక్స్‌కు చేరింది.

Also Read: చైనా మరో అద్భుతం.. స్వతంత్రంగా పనిచేసే ఏఐ ఏజెంట్ సృష్టి

ఫోల్డబుల్ ఫోన్లలో కూడా తన ప్రత్యేకత నిలుపుకునేందుకు యాపిల్ ప్రయత్నిస్తోందట. ఫోన్‌ను సన్నగా ఉండేలా డిజైన్ చేసేందుకు ప్రయత్నిస్తోందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఈ దిశగా డిస్‌ప్లే డీడీఐ విడిభాగాలను మెరుగుపరుస్తోందట.


యాపిల్ ఫోల్డబుల్ ఫోన్‌ను తెరిచినప్పుడు 7.8 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 5.5 అంగుళాల కవర్ డిస్‌ఫ్లేతో సిద్ధం చేస్తున్నారట. దీనర్థం ఫోన్‌లో ఎలాంటి హార్డ్‌వేర్ వాడాలనే అంశంపై యాపిల్ ఇప్పటికే ఓ నిర్ధారణకు వచ్చినట్టని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పుస్తకం తెరిచినట్టు ఉండేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేశారట. ఇక ఫోన్‌లో మడత పడే చోట డిస్‌ప్లే ఎక్కువకాలం మన్నేందుకు వీలుగా లిక్విడ్ మెటల్‌తో చేస్తున్నట్టు సమాచారం. దీంతో, ఆ భాగంలో ఫోల్డ్ గుర్తు కనబడకుండా ఉంటుందని యాపిల్ భావిస్తోంది.


Also Read: శాంసంగ్ కొత్త మోడల్స్.. వీటి ఏఐ ఫీచర్స్ చూస్తే..

కేవలం 4.5 మిల్లీమీటర్ల మందం ఉండేలా ఈ ఫోన్‌ను డిజైన్ చేస్తున్నారు. ఇక ఫోల్డ్ చేసిన సందర్భంలో మందం సుమారు 9.5 మిల్లీమీటర్ల వరకూ ఉండొచ్చు. పోన్‌ను ఈ స్థాయిలో సన్నగా డిజైన్ చేసేందుకు ఫేస్‌ఐడీ ఫీచర్‌కు యాపిల్ స్వస్థి పలికిందన్న కామెంట్ కూడా వినిపిస్తోంది. దీనికి బదులుగా పవర్‌ బటన్‌ప టచ్ సెన్సర్ ఏర్పాటు చేశారట. లగ్జరీ ఫీల్ తెచ్చేందుకు వీలుగా ఫోన్ ఛాసీని టైటానియంతో సిద్ధం చేశారట.

ఇక బ్యాటరీ సామర్థ్యం విషయంలో కూడా యాపిల్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే, బ్యాటరీ సామర్థ్యం ఎంత ఉంటుందనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. అయితే, 2026 ద్వితీయార్థంలో ఈ ఫోన్‌ను వాణిజ్య స్థాయిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రారంభ ధర రూ.1.98 లక్షల వరకూ ఉండొచ్చని అంచనా.

Read More Technology and Latest Telugu News

Updated Date - Mar 22 , 2025 | 09:18 PM