Share News

Ghibli Art: జిబ్లిఫోటోల కోసం మీ ఫోటోలను చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి..

ABN , Publish Date - Mar 31 , 2025 | 06:50 PM

సోషల్ మీడియాలో జనం జిబ్లి స్టైల్ ఆర్ట్ అంటే పిచ్చెక్కిపోతున్నారు. తమ వ్యక్తిగత ఫొటోల్ని ఇష్టం వచ్చినట్లు చాట్ జీపీటీలో అప్‌లోడ్ చేస్తున్నారు. మన వ్యక్తిగత ఫొటోలను చాట్ జీపీటీలో అప్‌లోడ్ చేయటం సేఫా? కాదా?

Ghibli Art: జిబ్లిఫోటోల కోసం మీ ఫోటోలను చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేస్తున్నారా.. ఇది తెలుసుకోండి..
ChatGPT Ghibli

సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇప్పుడు జిబ్లి పేరే వినిపిస్తోంది. మామూలు ఫొటోల్ని బిబ్లి స్టైల్ ఫొటోలుగా మార్చుకోవడానికి జనం తెగ ఆసక్తి చూపిస్తున్నారు. వ్యక్తిగత ఫొటోలను సైతం చాట్ జీపీటీలో అప్‌లోడ్ చేస్తున్నారు. జిబ్లి స్టైల్ ఫొటోలు క్రియేట్ అయిన తర్వాత వాటిని తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తుకుని తెగ మురిసిపోతున్నారు. అయితే, జిబ్లి స్టైల్ ఫొటోల కోసం మన వ్యక్తిగత ఫొటోలను చాట్ జీపీటీకి ఇవ్వటం సురక్షితమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. చాట్ జీపీటీలో మన వ్యక్తిగత ఫొటోలు అప్‌లోడ్ చేయటం సేఫా? కాదా? అంటే.. కచ్చితంగా కాదు. దాని వెనుక కారణాలు తెలిస్తే మీరు ఇంకో సారి ఫొటోలను చాట్ జీపీలో అప్‌లోడ్ చేయరు.


చాట్ జీపీటీ ఏం చేస్తుంది

మనం జిబ్లి స్టైల్ ఫొటోలు క్రియేట్ చేయించుకోవడానికి చాట్ జీపీటీలో మన వ్యక్తిగత ఫొటోలు అప్‌లోడ్ చేస్తాం. అది మీ ఫొటోల్ని యానిమే ఫొటోలుగా మార్చి ఇస్తుంది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, అప్‌లోడ్ చేసిన ఫొటోల సంగతి ఏంటి?.. అక్కడే అసలు సమస్య దాగుంది. మనం అప్‌లోడ్ చేసిన ఫొటోల్ని చాట్ జీపీటీ స్టోర్ చేసుకుంటుంది. వాటిని తర్వాత అవసరం వచ్చినపుడు వాడుకుంటుంది. ఎలా అంటే.. మీరే చాట్ జీపీటీలోకి వెళ్లి.. ఓ మంచి ఇండియన్ ఫ్యామిలీ ఫొటో క్రియేట్ చేయమని దానికి ప్రాంప్ట్ ఇచ్చారు అనుకోండి. అది తన దగ్గర ఉన్న ఫొటోలలోని మనుషుల ముఖాలను అటు, ఇటు చేసి ఓ కొత్త ఫొటోను క్రియేట్ చేస్తుంది.


అంటే మీరు కావచ్చు.. మీ కుటుంబం కావచ్చు.. వారి ముఖ కవళికలతో కొత్త ఫొటోలు క్రియేట్ అవుతాయి. మొత్తం మూడు రకాలుగా చాట్ జీపీటీ వల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది.

1) ప్రైవసీ వాయిలేషన్ : మనం చాట్ జీపీటీలో అప్‌లోడ్ చేసిన ఫొటోలకు ప్రైవసీ ఉండదు. వాటిని మన పర్మిషన్ లేకుండానే చాలా రకాల పనుల కోసం వాడే అవకాశం ఉంది.

2) ఐడెంటిటీ చోరీ : మీ ఐడెంటిటీని చాట్ జీపీటీ చోరీ చేసే అవకాశం ఉంది. వాటిని తప్పుడు పనులకు వాడే అవకాశం కూడా ఉంది.

3) డెటా సెక్యూరిటీ : మనం చాట్ జీపీటీకి అందించే డేటాకు ఎటువంటి భద్రత ఉండదు. హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

జైల్లో ఉన్న మహిళా ఖైదీని కిస్ చేసిన పోలీస్.. కట్ చేస్తే

Bryan Johnson: బ్రయాన్ జాన్సన్ ఓ మోసగాడు.. అస్సలు నమ్మొద్దు..

Updated Date - Mar 31 , 2025 | 07:10 PM