Home » Andhra Pradesh
నిలిచిపోయిన కోల్డ్ స్టోరేజీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడు హమీ ఇచ్చారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్ లలిత్‌సాగర్ దంపతులు మంత్రిని సచివాలయంలో కలిసి అభివృద్ధి పనులపై చర్చించారు.
నాగార్జున సాగర్, వేంపాడు మేజర్ ఆయకట్టుకు రబీలో సాగర్ జలాలు వచ్చేనా? లేదా? అని రైతులు ఆశ నిరాశలతో ఉన్నారు. వైసీపీ ప్రభు త్వం ఐదేళ్ల పాటు కనీస మరమ్మతులు చేయకపోవడంతో కాల్వలో చెట్లు, జమ్మి పెరిగి, భారీ వర్షాలకు గాళ్ళు పడి శిఽథిలావస్థకు చేరి నీరు నడిచే పరిస్థితి లేకుండా ఉంది.
సత్యసాయి అవతరించిన ప్రశాంతినిలయం ప్రపంచశాంతికి వేదికగా మారిందని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్‌నజీర్ పేర్కొన్నారు. సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు శనివారం ప్రశాంతినిలయంలోని సాయికుల్వంతులో కన్నుల పండువగా జరిగాయి.
వైసీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఏలూరు జిల్లాలో ఉన్న ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కూడా గుడ్‌బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా పేరొందిన తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరామసావమి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కార్తీక నాలుగో శనివారం కావడంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా నుంచి భారీగా భక్తజనం తరలివచ్చారు.
పార్వతీపురం మన్యం జిల్లాలో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న మొన్నటి వర కు వర్షాకాలంలో కూడా ఎండ తీవ్రత 40 డిగ్రీల వరకు కొనసాగింది.
‘దేశ భవిష్యత్తు నిర్మాణానికి తరగతి గదే పునాది’ అన్న మాటలను నిజమని నిరూ పిస్తున్నారా ఉపాధ్యాయుడు.
బొబ్బిలి ప్రాంతంలో భూ కబ్జాల పర్వంపై చాలా ఏళ్ల నుంచి అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగ తి తెలిసిందే. ఒక్క బొబ్బిలి మండలంలోనే సుమారు 200 ఎకరాలకు పైగా భూములను కబ్జాదారులు హస్తగతం చేసు కున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.
ఆయన కొనకనమిట్ల మండలంలోని గొట్లగట్టులో నెట్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. వైసీపీ సానుభూతిపరుడైన అతను గత ప్రభుత్వంలో వలంటీర్‌గా పనిచేశాడు. ఆ సమయంలో అక్రమార్జన కోసం అడ్డదారి తొక్కాడు. అధికారం అండతో విచ్చలవిడిగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు తయారు చేశాడు. రైతులకు అవసరమైన 1బీ, అడంగళ్లతోపాటు బర్త్, డెత్, సదరం, ఇతర పలు రకాల సేవలకు సంబంధించి నకిలీ పత్రాలు పెద్దమొత్తంలో సృష్టించాడు. ఒక్కో సర్టిఫికెట్‌కు ధర నిర్ణయించి అమ్ముకొని భారీగా సొమ్ము చేసుకున్నాడు.
మార్కాపురం మునిసిపాలిటీలో ఆక్రమణల తొలగింపును మునిసిపల్ అధికారులు మళ్లీ ప్రారంభించారు. పట్టణంలోని పలుచోట్ల శనివారం వేకువజాము నుంచి మురికి కాలువలపై ఉన్న నిర్మాణాలను ఎక్స్‌కవేటర్‌తో తొలగించారు. తొలగింపుల సమయంలో పోగైన వ్యర్థాలను కూడా ఎప్పటికప్పుడు ట్రాక్టర్ల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించారు. రీడింగ్ రూం వద్ద నుంచి ప్రారంభ