Home » Elections
Telangana: మే 13న పోలింగ్, వరుసగా మూడు రోజులు సెలవులు. ఇంకేముంది ప్రజలంతా సొంతూళ్ల బాట పట్టారు. వీకెండ్‌తో పాటు సోమవారం పోలింగ్ నేపథ్యంలో తెలుగు ప్రజలు పల్లెలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది వెళ్లిపోగా.. మరికొందరు ఈరోజు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంజీబీఎస్ వద్ద సొంతూళ్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వారితో బస్టాండ్ కిక్కిరిసి పోయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మే 13న ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా కొద్ది గంటలే సమయం ఉండటంతో ప్రచారం నేటి సాయంత్రానికి ముగియనుంంది. అరవై రోజుల పాటు పార్టీలన్నీ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాయి. ప్రతి ఏరియాలోనూ మైకుల మోత మోగింది.
నేటి సాయంత్రం ఆరు గంటలకు పార్లమెంట్ ఎన్నికల ప్రచార పర్వం ముగియనుంది. అరవై రోజుల పాటు సాగిన ప్రచారానికి నేటి సాయంత్రంతో తెరపడనుంది. పోలింగ్‌కు 48 గంటల ముందు మైకులు ఆగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో నాలుగు గంటల వరకే పోలింగ్ జరగనుంది.
లోక్ సభ ఎన్నికల్లో మహిళ ఓటర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. పురుషుల కన్నా ఓటింగ్ శాతం అతివలదే నమోదవుతోంది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మహిళల ఓటింగ్ శాతం 0.16 ఎక్కువగా ఉంది. ఈ సారి అది మరింత పెరిగేందుకు అవకాశం ఉంది. అందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు మహిళల కోసం వరాలు కురిపిస్తున్నాయి.
Telangana: భాగ్యనగరం ఖాళీ అవుతోంది. ఓట్లు వేసేందుకు తెలుగు ప్రజలు తమ తమ సొంతూర్లకు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం సగానికి పైగా ఖాళీ అవుతున్న పరిస్థితి. సొంతూర్లకు వెళ్లేందుకు ప్రజలు బస్టాండ్లకు తరలివెళ్తున్నారు. దీంతో జేబీఎస్ బస్టాండ్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగన వాసులు పల్లెబాట పట్టారు. ప్రయాణికులతో జేబీఎస్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఎన్నికలవేళ టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
ఉమ్మడి పాలకుల కంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కువ మోసం చేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. బీజేపీ నేత డీకే అరుణకు గుర్తింపు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. నేడు పాలమూరు జిల్లాలో పర్యటించిన మోదీ పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా గురించి మాట్లాడకపోవడం బాధాకరమని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు మూడు రోజుల సమయమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) విసృత్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా కరీంనగర్ నుంచి సిరిసిల్లకి వెళ్తుండగా కేసీఆర్‌కి మిడ్ మానేరు నిర్వాసితుల నిరసన సెగ తగిలింది.
దేశాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి లక్ష్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికలు భారత రాజ్యాంగాన్ని రక్షించేందుకు, రాజ్యాంగాన్ని తీసివేసే బీజేపీకి మధ్య జరుగుతున్న ఎన్నికలని తెలిపారు. దేశపు రాజ్యాంగాన్ని మార్చాలనుకోకపోతే కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.
కాంగ్రెస్‌లో మెజార్టీ నాయకులు హిందువులేనని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ (Shashi Tharoor) తెలిపారు. హిందువులం హిందువులను ఎందుకు ద్వేషిస్తామని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ద్వేషం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో ఉండనే ఉండదని స్పష్టం చేశారు.