Home » Elections
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయమే ఉండటంతో బీజేపీ ప్రచారాన్ని ఉదృతం చేసింది ఎన్నికల ప్రణాళికలో భాగంగా శుక్రవారం నగరంలోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ (BJP) ‘‘భాగ్యనగర్ జనసభ’’కు పిలుపునిచ్చిది. ఈ సభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ సభలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు (Rajasingh) చేదు అనుభవం ఎదురైంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మోసగాడని.. తమను నిలువునా మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) అన్నారు. కేసీఆర్‌కి మనం అండగా నిల్చున్న రోజులు చాలా ఉన్నాయని.. ఆయన మనల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన మాట తప్పాడనీ ప్రశ్నిస్తే తనను జైల్లో పెట్టించారని విరుచుకుపడ్డారు.
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఆర్ ఆర్ ట్యాక్స్ వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఆరోపించారు. తాను ఆర్ ఆర్ ట్యాక్స్ అన్నాను.. కానీ ఎవ్వరి పేరు చెప్పలేదని.. కానీ సీఎం రేవంత్ మాత్రం మీడియా ముందుకు వచ్చి అన్ని వివరాలు చెబతున్నారనిఅన్నారు. మొదట రాహూల్ ప్రేమ దుకాణం పెట్టి.. ఇప్పుడు విద్వేషం చూపుతున్నారని విమర్శించారు.
Telangana: ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు చేయాల్సిన అన్ని పనులు పూర్తి చేశామన్నారు. పోస్టల్ బ్యాలెట్‌కు చాలా మంచి స్పందన వచ్చిందని... 14,000 మంది పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించారని వెల్లడించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదని.. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఓడిపోయామనే బాధలోనే ప్రభుత్వం పడిపోతుందని కొందరు అంటున్నారని.. ఈ ఐదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని... అద్భుతమైన పాలన కొనసాగిస్తుందన్నారు. జనాభా లెక్కలను మోదీ బయట పెట్టడం లేదని.. అవి బయటపెడితే అన్ని విషయాలూ బయటకు వస్తాయన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోసపుమాటలు నమ్మవద్దని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ కలుగులో ఎలుక లాంటివాడని.. పెద్ద బ్లాక్ మెయిలర్ అని విమర్శించారు. కేసీఆర్ ఒక వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా అని విమర్శించారు. కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నాడని.. ఆయనేమైనా సుద్ద పూసా? అని ప్రశ్నించారు.
Telangana: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్షాన్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండ సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. ‘‘మీ బడుగు బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. కేసీఆర్ సీఎం, హరీష్ రావు మంత్రి అయ్యారు అంటే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లే. నరేంద్ర మోదీ ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.
అక్రమ ఆస్తులు, కేసులపై వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని సవాల్ విసిరారు. నేడు చిన్ని మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని అక్రమాలన్నింటినీ నిరూపిస్తానని.. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను ఆయన నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకో .. లేదంటే నీ అవినీతి, మోసాల చరిత్ర మొత్తం బయట పెడతానన్నారు.
Telangana: హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు పాల్గొని ప్రసంగించారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్‌కు చాలా ఇష్టమని.. సెంటిమెంట్ ఉన్న ప్రాంతమని అన్నారు. వికాసం కావాలంటే వినోద్ అన్న గెలువాలని.. విధ్యంసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ గెలవాలంటూ వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికల కోసం కేసీఆర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గత నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. 16 రోజుల పాటు 13 లోక్ సభ నియోజకవర్గాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ జరిగింది. ప్రచారానికి ఎన్నికల సంఘం బ్రేక్ ఇవ్వడంతో మే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు బ్రేక్ పడింది. మిగతా అంతా షెడ్యూల్ ప్రచారం జరిగింది. అయినప్పటికీ కేసీఆర్ ప్రభావం అంతగా కనిపించడం లేదు.