Home » Elections
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు-2024 పోలింగ్‌కి సమయం దగ్గర పడుతోంది. రేపు (శనివారం) ప్రచారపర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం ప్రియులను కాస్త నిరాశకు గురిచేసే కీలక అప్డేట్ వచ్చింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈనెల 13న పోలింగ్ జరగనున్నందున రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం (EC) నిషేధం విధించింది.
‘‘రాయల సీమలో వైసీపీ బలంగా ఉంది. దౌర్జన్యాలు చేసినా మన ఎస్‌హెచ్‌వోలే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. పొరుగు రాష్ట్రాలకు చెందిన బలగాలను ఇక్కడ పెడితే వారు స్థానిక ఎస్హెచ్వోలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కానీ, లూప్‌లైన్ విభాగాల్లో ఉన్న వారిని మాత్రం ఇటు రానీయొద్దు. అక్కడున్నది అధికార పార్టీపై అసంతృప్తులు. వారితో ఇబ్బంది’’- ఇదీ వైసీపీ వీరభక్త ఉన్నతస్థాయి పోలీసు అధికారుల మధ్య గత నెలలో జరిగిన చర్చ.
నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌కు(Lok Sabha Polling 2024) మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) అగ్రనాయకత్వం ప్రచారం దూసుకెళ్తుంది. బుధవారం నిర్మల్ జిల్లాలోని భైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో అనుకోని పరిణామం ఎదురైంది.
మోదీ పాలన వల్ల రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన జనజాతర భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఈ ఎన్నికల్లో దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన జనజాతర భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ స్థానాల పరిధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ విసృత్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. వరంగల్ లోక్‌సభ కాంగ్రెస్ (Congress) అభ్యర్థి కడియం కావ్య (Kadiyam Kavya) గురువారం జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ (BJP) పదేళ్లు దేశంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. నర్సాపూర్‌లో గురువారం కాంగ్రెస్ జనజాతర సభ జరిగింది. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దుబ్బాక ప్రజలకు బీజేపీ అభ్యర్థి (రఘునందన్‌రావు) ఏం చేయలేదని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. సూర్యాపేటలో గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఇంకా 4 రోజుల సమయమే ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది. పలు హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్లమెంట్ స్థానాల పరిధుల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని చెబుతూ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రచారంలో దూసుకెళ్తున్నారు.
పెద్దపల్లి లోక్ సభ స్థానానికి ప్రత్యేకత ఉంది. ఇక్కడ 2004 నుంచి ఎంపీ అభ్యర్థి మారుతున్నారు. మరో అభ్యర్థికి అవకాశం ఇవ్వడం లేదు. పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుంచి గడ్డం వంశీకృష్ణ బరిలోకి దిగారు. ఈయన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుమారుడు.