Home » Elections
తెలంగాణలో 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయలేక అట్టర్ ఫ్లాప్ అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. కేవలం ఐదు నెలల కాలంలోనే రేవంత్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకత తెచ్చుకుందని అన్నారు. బీజేపీ తెలంగాణకు మొండిచేయి చూపించిందని ఆరోపణలు చేశారు. ఆ పార్టీ కార్మికులకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు అనుకూలంగా పని చేస్తుందని విమర్శించారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదేళ్లు అవుతోంది. మోదీ- అమిత్ షా ద్వయం కాంగ్రెస్ పార్టీ ఇమేజిని క్రమంగా తగ్గించేశారు. ఈ సారి తక్కువ సీట్లలో కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. కేవలం 328 సీట్లలో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ సీట్లు తగ్గించుకోవడానికి కారణం పెద్ద రాష్ట్రాల్లో మిత్రపక్షాలకు న్యాయం చేయడం కోసమని తెలుస్తోంది.
పోలింగ్‌కు ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024, లోక్‌సభ ఎన్నికలు-2024లో విజేత ఎవరు అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు ఆసక్తికరమైన సర్వే రిపోర్టును ప్రకటించారు. జిల్లాల వారీగా తనకున్న సర్వే నివేదికలను ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ఖచ్చితంగా గెలిచి తీరుతుందని ఆయన అంచనా వేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు-2024 సమీపిస్తున్న తరుణంలో ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్టుగా రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య గురువారం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ రేషన్ డీలర్ల అసోసియేషన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించింది. రేషన్ డీలర్ల రాష్ట్ర సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరో నాలుగు రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Election 2024) జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్నికల్లో లబ్ది పొందేందుకు జగన్ చేస్తున్న కుటీల ప్రయత్నాలకు కేంద్ర ఎన్నికల సంఘం చెక్ పెట్టింది. సంక్షేమ పథకాల పేరుతో పోలింగ్‌కు 2 రోజుల ముందు డబ్బులు పంపిణీ చేయాలనే ప్రయత్నాలను తిప్పికొట్టింది. సంక్షేమ పథకాల సొమ్ముల చెల్లింపునకు కేంద్ర ఎన్నికల సంఘం నో చెప్పింది.
ఎన్నికలు.. ఓటర్లు.. అనగానే పురుషులు ఎంతమంది!? మహిళలు ఎంతమంది అని చూస్తారు కానీ.. మొత్తం ఓటర్లలో యువత సగానికి సగం ఉన్నారని తెలుసా!?
మోదీ పాలనలో అచ్చె దిన్ రాలేదు కాని.. చచ్చే దిన్ మాత్రం వచ్చిందని బీఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ఆరోపించారు. ప్రధాని మోదీ గత పదేళ్లలో ఇచ్చిన 150 హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా బుధవారం కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. పటాన్ చెరు జాతీయ రహదారిపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కార్నర్ మీటింగ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.
బీజేపీ ప్రభుత్వం తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు. పసుపు బోర్డు కోసం ఇక్కడి రైతులు దీక్ష చేసినప్పుడు వచ్చానని అన్నారు. వారు ఇచ్చిన సహకారంతో పీసీసీ అధ్యక్షుడినయ్యానని గుర్తుచేశారు. నిజామాబాద్ లోని ఆర్మూర్‌లో సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను అదుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొంటామని మాటిచ్చారు.బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో రైతు బంధు ఆపించారని మండిపడ్డారు. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల వేళ ఎన్నో ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్ ప్రజల మదిలో మెదులుతున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏబీఎన్ బిగ్ డిబేట్లో సమాధానం ఇచ్చారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించిన సూపర్ ఎక్స్‌క్లూజివ్ ‘బిగ్ డిబేట్’ ప్రత్యక్షంగా వీక్షించండి.