Home » Elections
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార పర్వానికి ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉండడం బరిలో నిలిచిన అభ్యర్థులతో పాటు పార్టీల అధినేతలు, ముఖ్య నేతలు ప్రచారాన్ని ఉధృతం చేశారు. మరీ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్డీయే కూటమి తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నేడు (బుధవారం) రంగంలోకి దిగారు.
పార్లమెంట్ ఎన్నికలకు ఇంకా 5 రోజుల సమయమే ఉండటంతో ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. నిన్న(మంగళవారం) ఓ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీని.. కురే కురే బీజేపీ అని విమర్శించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) కౌంటర్ ఇచ్చారు.
లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్ (KCR) కి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Gone Prakash Rao) అన్నారు. కేసీఆర్‌కి సిగ్గు, లజ్జ ఉందా ఇంకా ఎంతకాలం ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ చావు నోట్లో తల ఎక్కడ పెట్టారని నిలదీశారు. ఆయన ప్రజల్లో నిరాదరణకు గురి అయ్యారని... కేసీఆర్ కుటుంబ సభ్యులు జైలుకు వెళ్లారని చెప్పుకొచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ లోక్ సభ సీట్లను గెలుచుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 17 స్థానాల్లో కనీసం 14 సీట్లు గెలుస్తామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయారని గుర్తుచేశారు.
మాజీ సీఎం కేసీఆర్ (KCR) అంటే భయంతోనే కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం రైతు బంధును మళ్లీ మొదలుపెట్టిందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి (Ravula Sridhar Reddy) అన్నారు. రైతు బంధును ఎన్నికల కమిషన్ ఆపమని చెప్పిందని అబ్బద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. రైతు బంధు విషయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటలు నిజమా భట్టి విక్రమార్క మాటలు నిజమా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ పథకాలను నిధులు విడుదల చేయాలంటూ ఏపీ హైకోర్టులో (AP High Court) లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ ప్రభుత్వానికి మరోసారి నిరాశ ఎదురైంది. లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలకు కూడా నిధులు నిలిపివేయడం తగదని ప్రభుత్వ న్యాయవాది వాదించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల గురించి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నెలకొన్న పరిస్థితులు, లోక్ సభ ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్షన్ల గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో తమ పార్టీ పరిస్థితి గురించి వెంకట్ రెడ్డి ప్రస్తావించారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తోందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి బండి సంజయ్ గెలవడం పక్కా అని స్పష్టం చేశారు. వేములవాడలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనుండగా.. మూడు విడతలు ఇప్పటికే ముగిశాయి. పోలింగ్ ముగిసిన మూడోవిడతలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం మహారాష్ట్రలోని బారామతి.. ఇక్కడ ఫ్యామిలీ వార్ నడుస్తుండగా.. విజయంపై ఉత్కంఠ నెలకొంది. ఎన్సీపీ, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీల మధ్య ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ నెలకొంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు వేములవాడలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అంతకుముందు వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు. దర్శనానికి ముందు కోడె మొక్కును సమర్పించారు. గతంలో ప్రధాన మంత్రి స్థాయి వ్యక్తి ఎవరూ కూడా కోడె మొక్కు అందించలేదు.