desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
వారఫలాలు (జన్మ నక్షత్రం ప్రకారం) (19-09-2021)

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: ఏకాగ్రతతో శ్రమించండి. ఆలో చనల్లో మార్పు వస్తుంది. ఆదాయం సంతృప్తి కరం. కొంత మొత్తం పొదుపు చేస్తారు. ధనసహాయం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. సోమ, మంగళవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. గృహమార్పు అనివార్యం. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంది. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లోనుకావద్దు. నమ్మ కస్తులే మోసగిస్తారు. పత్రాలు జాగ్రత్త. సంస్థల స్థాపనకు అనుకూలం. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. శుక్ర, శనివారాల్లో పనులు అప్పగించవద్దు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉల్లాసంగా గడుపుతారు. బంధుత్వాలు బలపడతాయి. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: సంకల్పం సిద్థిస్తుంది. ఉత్సా హంగా ముందుకు సాగుతారు. పొదుపు పథకాలు కలిసివస్తాయి. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. అవకాశాలను వదులుకోవద్దు. ఆది, బుధవారాల్లో అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. పిల్లల విషయంలో శుభఫలితాలున్నాయి. యోగా, ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. పదవులు, బాధ్యతల నుంచి తప్పుకుంటారు.

సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: సంప్రదింపులతో తీరిక ఉండదు. మీ అభిప్రాయాలను సూచన ప్రాయంగా తెలియజేయండి. ఎవరినీతక్కువ అంచనా వేయొద్దు. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి బయట పడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గురువారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. ఫోన్‌ సందేశాలను విశ్వసించవద్దు. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి.

కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: అవిశ్రాంతంగా శ్రమిస్తారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మనోధైర్యంతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగు తాయి. సన్నిహితుల కలయికతో కుదుట పడతారు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగి స్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించ వద్దు. వేడుకకు హాజరవుతారు.

తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ధనసమస్యలెదురవుతాయి. సాయం అర్థిం చేందుకు మనస్కరించదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మంగళ, బుధవారాల్లో ఒత్తిడి. చికాకులు అధికం. సన్నిహితుల రాక ఉత్తేజాన్నిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యంజాగ్రత్త. సమావేశాల్లో పాల్గొంటారు.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం నిరుత్సాహ పరుస్తుంది. చీటికిమాటికి అసహనం చెందుతారు. మనోధైర్యంతో ముందుకు సాగండి. ఆకస్మిక ఖర్చులు ఆందోళన కలిగి స్తాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. గురు, శనివారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: ఈ వారం ఒత్తిడి, శ్రమ అధికం. కొన్ని విషయాలు అనుకున్నట్ట్టే జరుగుతాయి. మీ సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. పరిచయాలు బల పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. వ్యాప కాలు అధికమవుతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం.విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవ సరాలకు అతికష్టంమ్మీద ధనం సర్దుబాటవు తుంది. కొత్త పనులు చేపడతారు. సంప్రదిం పులు ముందుకు సాగవు. మానసికంగా కుదుటపడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. ఆప్తులను కలుసుకుంటారు. ఇంటి విషయాల పై శ్రద్థ వహించండి. ఏ విషయాన్నీతేలికగా తీసుకోవద్దు. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. చీటికిమాటికి అసహనం చెందుతారు. ఆదివారం నాడు ప్రముఖుల కలయిక వీలుపడదు. ఆలోచన లతోసతమతమవుతారు. స్థిమితంగా ఉండ టానికి యత్నించండి. ఫోన్‌ సందేశాలను విశ్వసించవద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపు తారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.

మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. పిల్లల చదు వులపై దృష్టిపెట్టండి. సంస్థల స్థాపనలకు అనుకూలం. మీ జోక్యం అనివార్యం. మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దీక్షలు స్వీకరిస్తారు.

Advertisement