desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
వారఫలాలు (జన్మ నక్షత్రం ప్రకారం) (27-12-2020)

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: కార్యసాధనకు మరింత శ్రమిం చాలి. యత్నాలు విరమించుకోవద్దు. స్వయంకృషి తోనే అనుకున్నది సాధిస్తారు. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. ఆది, సోమవారాల్లో పనులు మందకొడిగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. పత్రాలు అందుకుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: మీ కష్టం ఫలిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. గృహం సందడిగా ఉంటుంది. పిల్లల దూకుడు అదుపుచేయండి. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు లుంటాయి. ప్రణాళికలు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందు తుంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పరి చయాలు బలపడతాయి. గురు, శుక్రవారాల్లో పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ప్రియతముల గురించి ఆం దోళన చెందుతారు. మీ అభిప్రాయలను కచ్చితంగా వ్యక్తం చేయండి. పెట్టుబడులకు తరుణం కాదు.

కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: కార్యక్రమాలు విజయవంత మవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. గృహం సందడిగా ఉంటుంది. శనివారం నాడు ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిపెడతారు. పనులు సానుకూలమవు తాయి. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. ఆలయాలు, కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు.

సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: అనుకూలతలున్నాయి. మాట తీరు ఆకట్టుకుంటుంది. పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆది, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. సావ కాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం బాగుం టుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. ఇరువర్గాలకు మీ సలహా ఆమోదయోగ్యమవుతుంది. వేడుకల్లో పాల్గొంటారు.

కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. ఉత్సాహంగా గడుపు తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ప్రతి వ్యవహా రం ధనంతో ముడిపడి ఉంటుంది. బుధ, గురు వారాల్లో అనవసర జోక్యం తగదు. పనులు సావకా శంగా పూర్తిచేస్తారు. ప్రకటనలను విశ్వసించవద్దు. గృహమార్పులు చేపడతారు. దైవదర్శనాలు ఉల్లా సం కలిగిస్తాయి. పోటీల్లో విజయం సాధిస్తారు.

తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: మీ కష్టం ఫలిస్తుంది. రావల సిన ధనం అందుతుంది. ఊహించిన ఖర్చులే ఉం టాయి. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. పెద్దమొత్తం సాయం తగదు. శని, ఆదివారాల్లో పనులు హడావుడిగా సాగుతాయి. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తు వులు లభ్యమవుతాయి. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. సంస్థల స్థాపనకు అనుకూలం. ఆరోగ్యం జాగ్రత్త. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: మీ కష్టం ఊరికే పోదు. అవకా శాలను తక్షణం వినియోగించుకోండి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బంధువులతో తెగిపోయిన సంబంఽ దాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. సోమ, మంగళవారాల్లో విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. పిల్లల విషయంలో శుభఫలితాలున్నాయి. ఆలయాలు సందర్శిస్తారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. పోటీల్లో విజయం సాధిస్తారు.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: ఈ వారం ఆశాజనకం. కష్టం ఫలిస్తుంది. పనులు సానుకూలమవుతాయి. ఆదాయం సంతృప్తికరం. వ్యాపకాలు అధికమవుతాయి. బాధ్య తలు అప్పగించవద్దు. గృహంలో మార్పులకు అను కూలం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పిల్లల దూకుడు అదుపుచేయండి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: ప్రతికూలతలు ఎదురవుతాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. పరిచయస్తుల వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. విమర్శలు, అభియో గాలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పట్టించు కోవద్దు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. ఆప్తుల జోక్యంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. కొంతమొత్తం ధనం అందుతుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పిల్లల అత్యుత్సాహం అదుపుచేయండి. పోటీలు ఉల్లాసం కలిగిస్తాయి.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: శ్రమ అధికం, ఫలితం శూన్యం. ఓర్పుతో వ్యవహరించండి. యత్నాలు విరమించు కోవద్దు. సన్నిహితుల హితవు మీపై సత్ప్రభావం చూపుతుంది. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. శని, ఆదివారాల్లో పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ప్రముఖుల సందర్శనం వీలు పడదు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవు తాయి. సౌమ్యంగా మెలగండి. ప్రియతముల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ధనయోగం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పరి చయాలు బలపడతాయి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. సోమ, మంగళవారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. విలువైన వస్తువులు జాగ్రత్త. అను నయంగా మెలగండి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు.

Advertisement