పూర్వాభాద్ర 4; ఉత్తరాభాద్ర, రేవతి
ఆదాయం - 14 వ్యయం - 5
రాజపూజ్యం - 2 అవమానం - 4
మీన రాశి వారు ఏప్రిల్ నుంచి జూన్ వరకు, పిదప నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఆస్తి పాస్తులు సమకూర్చుకుంటారు. గృహనిర్మాణ యత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. అను బంధాలు బలపడతాయి. ప్రముఖులతో పరిచయాలు లాభిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యా ర్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. విదేశీగమన యత్నా లు ఫలిస్తాయి. జూన్ - అక్టోబర్ మాసాల మధ్య ఆర్థిక వ్యవహారాల్లో నిరుత్సాహం. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిళ్లు ఎదురవుతాయి. సన్నిహితులతో మాటపడాల్సి రావచ్చు.
గురువు ఈ ఏడాది 11, 12 స్థానాల్లో సంచరిస్తున్నాడు. ఫలితంగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. సంతానం విషయంలో అభివృద్ధికి, శుభకార్యాలకు అవకాశం ఉంది. వైవాహిక జీవితం ఉల్లా సంగా గడుస్తుంది. మార్కెటింగ్, విద్య, వైజ్ఞానిక, ప్రచురణలు, ప్రకటనలు, బోధన, న్యాయ, సినీ, రాజకీయ రంగాలవారికి ఆర్థికంగా ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త వ్యాపా రాలు ప్రారంభిస్తారు. స్నేహానుబంధాలు పెంపొందు తాయి. విద్యార్థులకు శుభప్రదం. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. నవంబర్ 20 నుంచి టెక్స్టైల్స్, చలనచిత్రాలు, మత్స్య, రవాణా, టైల్స్, ఫొటోగ్రఫీ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విదేశాలలో చదువులకై చేసే యత్నాలు ఫలిస్తాయి. జూన్ 21-అక్టోబర్ 12ల మధ్య ఉద్యో గం, వ్యాపారాల్లో శ్రమ అఽధికం. పెద్దల ఆరోగ్యం మందగించవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరిం చాలి. అన్నదమ్ముల మధ్య అవగాహన లోపిస్తుంది.
11వ స్థానంలో శని సంచారం కారణంగా వ్యాపారంలో లాభాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చు. విందులు, విలాసాలకు ఖర్చులు అధికమవుతాయి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. బంధు మిత్రుల కారణంగా బాధ్యతలు అధికమవుతాయి. ఆరో గ్యంపై శ్రద్ధ వహించాలి. వృత్తిపరమైన పనులతో ఒత్తిడికి లోనవుతారు. విద్యార్థులకు అనుకూలం. మే 24 - అక్టోబర్ 19ల మధ్య ఆర్థిక పరిస్థితి కొంత ప్రోత్సాహకరం. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. క్రమశిక్షణతో, ఓరిమితో చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రుల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. సహోద్యోగుల నుంచి ఒత్తిళ్లు ఎదు రవుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి.
రాహు కేతువులు 3, 9 స్థానాల్లో సంచరించడం వల్ల ఉద్యోగంలో బదిలీలు, మార్పుచేర్పులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఈ ఏడాది ఏప్రిల్, మేలలో తదుపరి నవంబర్, డిసెంబర్ మాసాల్లో ప్రోత్సాహకరంగా ఉం టుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. స్నేహితులతో మాట పడాల్సి రావచ్చు.
ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలి. శ్రీ కామాక్షీదేవి ఆరాధన సమస్యలను తొలగిస్తుంది.