Home » America
ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి కచ్చితంగా సినిమా చూపిస్తామని, గన్నవరం సభలో తాను కొన్ని హామీలు ఇచ్చానని.. అవి గుర్తున్నాయని, ఎలాంటి సందేహం అవసరం లేదని.. త్వరలోనే మూడో చాప్టర్ కూడా తెరుస్తానని మంత్రి లోకేష్ అన్నారు. అట్లాంటాలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
సేల్స్ ఫోర్స్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లలతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్టప్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందని, ఏపీలో ఎఐ వర్సిటీ, డాటా సెంటర్లు రాబోతున్నాయని... పెట్టుబడులకు ఇదే సరైన సమయమని లోకేష్ వారికి వివరించారు. వారం రోజులుగా సంస్థల ప్రతినిధులు సీఈవోలు, వైస్ ప్రెసిడెంట్‌తో నారా లోకేష్ వరుస బేటీలు నిర్వహిస్తున్నారు.
ప్రపంచ బిలియనీర్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి వార్తల్లో ఉన్నారు. ఇటివల తన 11 మంది పిల్లలు, వారి తల్లులను ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం వందల కోట్లు ఖర్చు చేసినట్లు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Andhrapradesh: ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేష్.. అమెరికా పర్యటన కొనసాగుతోంది. లాస్ వెగాస్‌లో ఐటీ సర్వ్ సినర్జీ సదస్సుకు హాజరైన మంత్రి.. అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) మేనేజింగ్ డైరక్టర్ రేచల్ స్కాఫ్‌ను కలిశారు. ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెటుబడులే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్.. యూఎస్‌లో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా లాస్ వెగాస్‌లో ఐటీ సర్వ్ సినర్జీ సమ్మిట్‌లో మంత్రి లోకేశ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన కీలకోపన్యాసం చేయనున్నారు. అలాగే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను సైతం మంత్రి నారా లోకేశ్ ఈ సదస్సులో వివరించనున్నారు.
ఉత్కంఠ రేపుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2024లో పోలింగ్ మొదలైంది. ముందస్తు ఓటింగ్‌లో చాలా మంది ఓటు హక్కుని ఉపయోగించుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా సోమవారం ఓటు వేశారు. సొంత రాష్ట్రం డేలావేర్‌లో దాదాపు 40 నిమిషాల పాటు క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు సాంకేతిక సహకారం అందించాలని మైక్రో సాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లను మంత్రి నారా లోకేష్ కోరారు. అమరావతిని ఎఐ క్యాపిటల్‌గా తీర్చిదిద్దేందుకు సహకరించాలని, రాష్ట్రంలో ఐటి హబ్‌లకు సహకారం అందించాలని, ఒకసారి ఏపీని సందర్శించాల్సిందిగా సత్య నాదెళ్లను లోకేష్ ఆహ్వానించారు.
వచ్చే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు ఓటేసేందుకు గతంలో కంటే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు ఓ సర్వే స్పష్టం చేసింది.
Andhrapradesh: అమెరికా పర్యటనలో మంత్రి లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీకి పెట్టుబడులను తీసుకువచ్చే లక్ష్యంతో వివిధ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశమవుతున్నారు. ఈ సందర్భంగా టెస్లా సీఎఫ్ఓతో లోకేష్ భేటీ అయ్యారు.
ఏపీ యువతకు రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఇటీవల ఆరు పాలసీలను ప్రకటించారని మంత్రి లోకేష్ తెలిపారు. ఇందులో భాగంగా అమెరికాలో పర్యటిస్తున్న ఆయన శాన్ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ఆధ్వర్యాన పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.