Home » Anumula Revanth Reddy- Congress
మొదట సీతక్కను పీసీసీ చేయగలరా? రేవంత్ సమాధానం చెప్పాలి. అవసరమైతే కాదు.. సీతక్కను సీఎం చెస్తామని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పలేదు? యూసీసీ బిల్లు ఉభయ సభల్లో పాస్ అయ్యాక సీఎం కేసీఆర్ పాకిస్తాన్ పోవాల్సిందే.
ఉచిత విద్యుత్ అవసరంలేదన్న రేవంత్ వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగాన్ని అవమానపరిచినట్టుగా ఉన్నాయి. ప్రజా క్షేత్రంలో ఇలాంటి నేతలకు శిక్ష తప్పదు. కరెంటు ఇవ్వడం దండగ అన్నట్లుగా మాట్లాడటం అవివేకం. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిని.. ఆ పార్టీలను తెలంగాణలో బొందపెట్టాలి. తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేసిన ఘనత బీఆర్‌ఎస్‌దే.
కమలం పార్టీలో చోటుచేసుకున్న పరిణామాలు తెలంగాణ బీజేపీలో తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేపోతోంది. నిన్నటి దాకా ఒకలా.. ఇప్పుడొకలా పార్టీ తీరు మారిపోయింది. ఉన్నట్టుండి బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా తొలగించటాన్ని పలువురు సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. బీఆర్ఎస్, బీజేపీల నుంచి పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు కొనసాగుతున్నాయి. నేడు బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి చొప్పదండి, వనపర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు చేరారు.
ఆదివారం ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ నిర్వహించతలపెట్టిన ‘తెలంగాణ జనగర్జన’ (Telangana Janagarjana) సభపై ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge), టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు.
కాంగ్రెస్‌లో చేరికలపై ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరే వారంతా త్వరలో బీజేపీలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్‌లో భారీ చేరికలు అంటూ జరుగుతున్న ప్రచారం మీడియా సృష్టే. ముఖ్యమంత్రి కేసీఆర్ పని కట్టుకుని కాంగ్రెస్‌కు హైప్ చేయిస్తున్నారు. తొందరపడి
బీఆర్ఎస్ ప్రభుత్వానికి మూడోసారి పరిపాలించే నైతిక హక్కు కోల్పోయింది అని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఢిల్లీలో రాహుల్‌గాంధీతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌వి అన్ని బోగస్ మాటలు అని మండిపడ్డారు. కేసీఆర్ పరిపాలన చూశాక ప్రజలకు అంతా అర్థమైందని చెప్పుకొచ్చారు. సోనియా రుణం తీర్చుకునేందుకు తెలంగాణ ప్రజలకు వచ్చి అవకాశం వచ్చిందని.. ఇది అందరి బాధ్యత అని గుర్తుచేశారు.
తెలంగాణ రాజకీయ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుల భేటీ ముగిసింది. వారివురూ ఢిల్లీలో అరగంటకుపైగా రాహుల్‌తో చర్చించారు. జులై 2న ఖమ్మం రావాలని రాహుల్‌ని పొంగులేటి ఆహ్వానించారు.
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైపోయింది. అన్ని పార్టీలు ఎవరికి వారే ఎత్తులకు పైఎత్తులు వేస్తూ దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ మంచి జోష్‌లో ఉన్నట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక.. ఆ ఊపు తెలంగాణ కాంగ్రెస్‌లో కూడా మొదలైంది. ఇందుకు జూపల్లి, పొంగులేటి లాంటి పెద్ద లీడర్లు హస్తం గూటికి చేరడమే కారణం.
మంత్రి కేటీఆర్‌కు కేంద్రమంత్రులు అపాయింట్‌మెంట్ ఇవ్వడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. రాజకీయ పార్టీలు వేరు.. ప్రభుత్వం వేరని బీజేపీ అధ్యక్షుడు తేల్చిచెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరెళ్లినా కేంద్ర పెద్దలు అపాయింట్‌మెంట్ ఇస్తారని తెలిపారు. కేటీఆర్.. కేంద్ర పెద్దలను కలవడం సాధారణ విషయమేనని