Home » Assam
అస్సాంలోని కాచార్ జిల్లా సిల్చార్లో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో(ఎన్ఐటీ) ఓ విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా మిగతా విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
మెరుగైన విద్య అందించే పాఠశాలలు చాలా ఎక్కువ డబ్బు వసూలు చేస్తాయి. కానీ ఆ పాఠశాలలో మాత్రం డబ్బులు కట్టక్కర్లేదు. దానికి బదులుగా ప్లాస్టిక్ బాటిళ్లు స్కూల్లో డిపాజిట్ చేయాలి.
అసోం ముఖ్యమంత్రి హిమంత బస్వ శర్మ, లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ మధ్య తలెత్తిన మాటల యుద్ధం గురువారంనాడు తారాస్థాయికి చేరింది. గొగోయ్ ఆరోపణలపై అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నానని, కోర్టులోనే ఆయనను కలుస్తానని తాజా ట్వీట్లో శర్మ పేర్కొన్నారు.
అస్సాం బీజేపీ నేత, ఎంపీ రాజ్దీప్ రాయ్ (Rajdeep Roy) నివాసంలో పదేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ బాలుని మెడకు గుడ్డ చుట్టి ఉండగా, వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యంలోనే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ను నిర్దేశించింది. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఇకపై టీ-షర్టులు, జీన్స్, లెగ్గింగ్స్ వంటివాటిని ధరించరాదని ఆదేశించింది.
తోటి ప్రజలపై తూటాల వర్షం కురిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. అంతర్గత సమస్యలకు పరిష్కారం లోపలి నుంచే రావాలని, కారుణ్యం, అవగాహనల ద్వారా పరిష్కారం కుదరాలని చెప్పారు.
ఈశాన్య భారతంలోని రాష్ట్రం మణిపూర్లో మూడు నెలల నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ ఓ విషయంలో ఏకతాటిపైకి వస్తాయని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయడానికి ఈశాన్య రాష్ట్రాలన్నీ ఏకమవుతాయని చెప్పారు.
‘లవ్ జీహాద్’ గురించి కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. బుజ్జగింపు రాజకీయాల కోసం పాకులాడే పార్టీలు ‘లవ్ జీహాద్’ను పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపిస్తుండగా, ఇదంతా ఓ వర్గంపై జరుగుతున్న దుష్ప్రచారమని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని నిరోధించడం కోసం దేశవ్యాప్తంగా విధించిన అష్ట దిగ్బంధనం సమయంలో చిగురించిన ప్రేమ ముగ్గురి హత్యతో విషాదాంతమైంది. ఎంతో నమ్మకంతో పెళ్లి చేసుకున్న యువతిని, ఆమె తల్లిదండ్రులను ఆ యువకుడు కిరాతకంగా హత్య చేసి, పోలీసులకు లొంగిపోయాడు.
ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న చంద్రయాన్-3 ప్రయోగం నేపథ్యంలో అస్సాంలోని తేజ్పూర్ విశ్వవిద్యాలయంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.