Home » Assembly elections
కేకే సంస్థ అంచనాలు తప్పాయి. ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పోల్స్, దైనిక్ భాస్కర్, పీపుల్ పల్స్, మ్యాట్రిజ్, దైనిక్ భాస్కర్, పీ మార్క్, సీ ఓటర్ సంస్థల అంచనాలు తప్పాయి. అసలు సర్వే సంస్థల అంచనాలు ఎందుకు తప్పాయనే దానిపై భిన్నభిప్రాయాలు..
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది! ప్రీ పోల్, పోస్ట్ పోల్, ఎగ్జిట్ పోల్ అంచనాల్ని తలకిందులు చేస్తూ.. రాజకీయ నిపుణుల విశ్లేషణలను అబద్ధం చేస్తూ.. ముచ్చటగా మూడోసారి విజయం సాధించింది!
త్వరలో జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేసినా తమ మద్దతు ఉంటుందని శివసేన(యూబీటీ) పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే స్పష్టం చేశారు.
తుపాకుల కాల్పులు.. బాంబుల మోతతో దద్దరిల్లే కశ్మీర్లో ప్రజాస్వామ్యం గెలిచింది.
కుస్తీ యోధురాలు, ట్రిపుల్ ఒలింపియన్ వినేశ్ ఫొగట్ హరియాణా ఎన్నికల సమరంలో మాత్రం ఓ ‘పట్టు’ పట్టారు. ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్లో దురదృష్టవశాత్తు తృటిలో పతకం చేజారినా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.
హరియాణాలో బీజేపీ ఎన్నికల వ్యూహం ఫలించినట్టు కనిపిస్తోంది. ప్రస్తుత సీఎం నయాబ్ సింగ్ సైనీ.. సీఎంగా కొనసాగడం దాదాపు ఖాయమైంది.
హంగ్ ఖాయమనే అంచనాలు.. నామినేటెడ్ ఎమ్మెల్యేల ఓట్లు కీలకమనే ఆందోళనలు.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు తప్పవన్న సంకేతాలు..!
సరిగ్గా ఆరు నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి చేతిలో పరాజయం పాలైన ఆయన.. ఆ దెబ్బ నుంచి కోలుకుని అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటారు. పోటీ చేసిన రెండుచోట్లా గెలిచి.. పదేళ్ల విరామం తర్వాత సీఎం పదవిని చేపట్టనున్నారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని తాము ఆమోదించబోమని, రాష్ట్రంలో మార్పును కోరుకున్న ప్రజల అభిమతానికి భిన్నంగా ఈ ఫలితం ఉందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజీపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినందుకు ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.