Home » Assembly elections
హంగ్ ఖాయమనే అంచనాలు.. నామినేటెడ్ ఎమ్మెల్యేల ఓట్లు కీలకమనే ఆందోళనలు.. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నాలు తప్పవన్న సంకేతాలు..!
సరిగ్గా ఆరు నెలల కిందట జరిగిన లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి చేతిలో పరాజయం పాలైన ఆయన.. ఆ దెబ్బ నుంచి కోలుకుని అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటారు. పోటీ చేసిన రెండుచోట్లా గెలిచి.. పదేళ్ల విరామం తర్వాత సీఎం పదవిని చేపట్టనున్నారు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని తాము ఆమోదించబోమని, రాష్ట్రంలో మార్పును కోరుకున్న ప్రజల అభిమతానికి భిన్నంగా ఈ ఫలితం ఉందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజీపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినందుకు ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
రెండు సార్లు వరుసగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కమలం పార్టీపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చనే 'ఎగ్జి్ట్ పోల్స్' అంచనాలు తలకిందులు చేస్తూ భారతీయ జనతా పార్టీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసింది.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ అండ్ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్కూటమి మెజారిటీ మార్క్ను దాటి అధికార పీఠాన్ని ఖాయం చేసుకుంది.
హర్యానా ఎన్నికల కౌంటింగ్ ఫలితాలు వెలువడుతున్న క్రమంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ భర్త రాబర్డ్ వాద్రా సంచలన పోస్ట్ చేశారు. ''ప్రజలు ఏది కోరుకుంటున్నారో దానిని అంగీకరించండి'' అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.
హర్యానా ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపించిన రెండు అంశాలు ఒకటి జాట్లు, రెండు జిలేబీలు. కాంగ్రెస్ పార్టీ అయితే ఈ రెండు అంశాలపై గట్టి ఆశలే పెట్టుకుంది. అయితే ఆ ఆశలపై ఓటర్లు నీళ్లు చల్లారు.
పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్లో ఎన్నికలు జరిగి, కొత్త ప్రభుత్వం ఏర్పడుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయం కాగా, చిన్న పార్టీలకు మాత్రం ఈ ఎన్నికల్లో గ్రహణం పట్టింది.
రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లానే అని ఆయన ప్రకటించారు. దశాబ్దం తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు కచ్చితమైన తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అల్లా సైతం తమ ప్రార్థనలను ఆలకించారని ఈ సందర్భంగా తెలిపారు.