Home » Assembly elections
రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లానే అని ఆయన ప్రకటించారు. దశాబ్దం తర్వాత జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లు కచ్చితమైన తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. అల్లా సైతం తమ ప్రార్థనలను ఆలకించారని ఈ సందర్భంగా తెలిపారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ' గెలుపు ఖాతా తెరిచింది. దోడా అసెంబ్లీ నియోజకవర్గంలో 'ఆప్' అభ్యర్థి మేహరాజ్ మాలిక్ గెలుపొందారు. తన సమీప బీజేపీ ప్రత్యర్థి గజయ్ సింగ్ రాణాపై ఆయన 4,770 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఓవైపు జరుగుతుండగా ట్రెండ్స్‌ను ఈసీఐ వెబ్సైట్ తప్పుదారి పట్టిస్తోందంటూ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ సంచలన ఆరోపణ చేశారు.
ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం సాయంత్రం రానున్నారు. హర్యానాలో హ్యాట్రిక్ విజయం దాదాపు ఖాయం కావడంతో మోదీ కార్యకర్తలను ఉద్దేశంచి ప్రసంగించనున్నారు.
హరియాణా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. హరియాణాలో బీజేపీ దూసుకెళ్తుండగా.. జమ్మూ కశ్మీర్లో ఇండియా కూటమి హవా కొనసాగిస్తోంది.
శ్రీగుఫ్వారా – బిజ్బెహరా (Srigufwara – Bijbehara)నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ (Iltija Mufti) ఓటమి పాలయ్యారు.
హరియాణా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తొలి ట్రెండ్స్‌లో రెండు రాష్ట్రాల్లోనూ ఆధిక్యతను ప్రదర్శించిన కాంగ్రెస్, ఇండియా కూటమి.. తరువాతి ట్రెండ్స్‌లో బలహీనపడసాగింది.
హరియాణా, జమ్మూ కాశ్మీర్లలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 11 గంటల వరకు ఇరు రాష్ట్రాల్లో ట్రెండ్ తెలిసిపోయే అవకాశం ఉంది.
జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నిల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. హరియాణాలో కాంగ్రెస్ ఘన విజయం సాధించనుందని..
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలోనే వెలువడనుండటంతో విపక్ష 'మహా వికాస్ అఘాడి' కూటమి సీట్ల పంపకాలపై కీలక అడుగు పడింది.