Home » Assembly elections
జమ్మూ కశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మంగళవారం ఉదయం ప్రారంభం కానుంది. అందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సర్వం సిద్దం చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను సీఈసీ ఏర్పాటు చేసింది.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లోనే వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ముఖ్యంగా పీడీపీ మద్దతు ఎవరికి ఉండవచ్చనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతోంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో సహా పలు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం, హోరాహోరీ ప్రచారానంతరం ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్ సర్వేలు, మరో మూడు రోజుల్లో వెలువడే ఎన్నికల ఫలితాలపై తాజాగా ఉత్కంఠ నెలకొంది.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల(Haryana Assembly Elections 2024) పోలింగ్ ప్రారంభమైంది. చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది.
ఓ వేళ.. హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటరు పట్టం కడితే మాత్రం.. మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ రాష్ట్ర ఓటరు క్లీన్ చీట్ ఇచ్చినట్లే అవుతుందని ఓ చర్చ సైతం నడుస్తుంది. ఇంకోవైపు.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు జస్ట్ కొన్ని గంటల ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి వయా ఆప్ పార్టీ మీదగా బీజేపీలో అశోక్ తన్వర్ చేరారు. ఆయన మళ్లీ తన సొంత గూటికి అంటే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హరియాణాలో జాట్ల ప్రాబల్యం చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ సామాజిక వర్గమే బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మరోవైపు జాట్ ఓట్లను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
మరికొన్ని గంటల్లో హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 5న ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ సహా పలు పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. అయితే అధికార బీజేపీపట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ వాటన్నింటినీ అధిగమించి మరోసారి మూడోసారి అధికారం చేపట్టాలని ఆ పార్టీ అహర్నిశలు శ్రమిస్తోంది.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్ మంగళవారం ముగిసింది. రికార్డు స్థాయిలో 65.65 శాతం పోలింగ్ నమోదైంది.
2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కూటమికి పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా బయట నుంచి మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక 2019 ఎన్నికల్లో ఒంటరిగా ఎన్నికల బరిలో నిలిచారీ పవన్ కల్యాణ్. గాజువాక, భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్ పార్టీ రామమందిర నిర్మాణానికి అడ్డుపడిందని, జమ్మూకశ్మీర్‌లో సంపూర్ణంగా రాజ్యాంగాన్ని అమలు కానీయలేదని, అసెంబ్లీల్లో, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ పాటించలేదని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదని, కేవలం సొంత కుటుంబం కోసమే పనిచేసిందని మోదీ విమర్శించారు