Home » Assembly elections
జమ్మూ కశ్మీర్ మూడో విడత ఎన్నికల పోలింగ్ మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ నేడు ఆ రాష్ట్రంలో పర్యటించనున్నారు. అందులోభాగంగా జమ్మూలోని ఎమ్ఏ స్టేడియంలో నిర్వహించే బీజేపీ సంకల్ప్ మహా ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఇక ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ అక్టోబర్ 1వ తేదీన జరగనుంది. ఈ విడతలో జమ్మూ డివిజన్లో మిగిలిన 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.
అసెంబ్లీ ఎన్నికల వేళ 13 మంది తిరుగుబాటు నేతలపై హరియాణా కాంగ్రెస్ చర్యలు తీసుకుంది.
పార్టీ బహిష్కరణ వేటు పడిన ప్రముఖ నేతల్లో గల్బా ఎస్సీ నియోజకవర్గానికి చెందిన నరేష్ ధాండే, జింద్ నుంచి ప్రదీప్ దిల్, పుండ్రి నుంచి సజ్జన్ సింగ్, పానిపట్ రూరల్ నుంచి విజయ్ జైన్ తదితరులు ఉన్నారు. తిరుగుబాటు నేతలను పార్టీ నుంచి బహిష్కరిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఉదయ్ భాను ఆదేశాలు జారీ చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో రాజంపేట నియోజక వర్గం లో తెలుగుదేశంపార్టీ ఓటమికి మాజీ ఎమ్మెల్యే మేడా మల్లి కార్జునరెడ్డి అతని కుటుంబమే కారణమని టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం ఆరోపించారు.
జమ్మూలోని శ్రీమాతా వైష్ణోదేవి సీటులో అత్యధికంగా 75.29 శాతం పోలింగ్ నమోదు కాగా, పూంచ్-హవేలీలో 72.71 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. కశ్మీర్‌లోని 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఖాన్‌సాహెబ్ సెగ్మెంట్లో 67.70 శాతం, కంగన్ (ఎస్టీ)లో 67.60, చరర్-ఇ-షరీఫ్‌లో 66 శాతం పోలింగ్ నమోదైంది.
సోనిపట్ జిల్లాలోని రోహ్తక్-పానిపట్ హైవే బైపాస్ వెంబడి బుధవారంనాడు ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. గాంధీ కుటుంబంపై విమర్శలు గుప్పిస్తూ హర్యానాను మధ్యవర్తులు, అల్లుళ్లుకు కాంగ్రెస్ అప్పగించిందని ఆరోపించారు.
దాదాపు దశాబ్దం తర్వాత జరుగుతున్న ఎన్నికలు. అది కూడా ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియను 15 మంది వివిధ దేశాల దౌత్యవేత్తల బృందం పరిశీలిస్తుంది. అందుకోసం బుధవారం ఉదయం ఈ ప్రతినిధి బృందం శ్రీనగర్ చేరుకుంది. అనంతరం ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని పోలింగ్ సరళిని పరిశీలించి.. ఓటర్లతో ఈ ప్రతినిధి బృందం మాట్లాడుతుంది.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. ఈ ఎన్నికల పోలింగ్ ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. దీంతో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఈ విడతలో రాష్ట్రంలో ఆరు జిల్లాలోని మొత్తం 26 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జమ్ముకశ్మీర్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో.. రెండో దశ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది!
నిజాయితీపరుడుగా తనకు ఉన్న ఇమేజ్ను దెబ్బతీసేందుకు బీజేపీ తనను జైలుకు పంపిందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. జైలులో ఉంచడం ద్వారా తనను మానసికంగా, శారీరకంగా బలహీనుడిని చేయాలని వారు అనుకున్నారని చెప్పారు.