Home » Australia
Team India Fans Tensions: ఆదివారం గుజరాత్‌లోని అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. 2003 తర్వాత ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆడటం ఇది రెండోసారి. దీంతో ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అయితే అభిమానుల్లో నాలుగు భయాలు మాత్రం వెంటాడుతున్నాయి
Team India: మెగా టోర్నీ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతోనే ఐదు టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్ కోసం టీమిండియాకు కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. రెగ్యులర్ టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్య గాయపడటంతో అతడి స్థానంలో కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సూర్యకుమార్ యాదవ్‌ను నియమించనున్నట్లు సమాచారం.
World Cup Sentiments: 2003లో మాదిరి లెక్కలు కలిసివస్తే ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం ఖరారైనట్లేనని అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 2003లో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగడం యాధృచ్ఛికం అని చెప్పవచ్చు. 2003లో జరిగిన మెగా టోర్నీలో ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా 10 మ్యాచ్‌లలో, భారత్ 8 మ్యాచ్‌లలో గెలిచాయి. ఈ ప్రపంచకప్‌లో సీన్ రివర్స్ అయ్యింది కాబట్టి విజేత కూడా ఇండియానే అని అందరూ భావిస్తున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీఫైనల్లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. దీంతో ఈనెల 19న అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో టీమిండియాతో ఆస్ట్రేలియా తలపడనుంది.
ODI World Cup 2nd Semi Final: దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీఫైనల్ చప్పగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తడబడింది. మిల్లర్, క్లాసెన్ మినహా మిగతా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది.
ODI World Cup: వన్డే ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ జరుగుతోంది. కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతో ఆ జట్టు బరిలోకి దిగింది. కేశవ్ మహరాజ్, షాంసీని జట్టులోకి తీసుకుంది. అయితే ఆస్ట్రేలియా ఒక స్పిన్నర్‌ను మాత్రమే ఎంచుకుంది.
వన్డే ప్రపంచకప్ పూర్తి కాగానే టీమిండియా బిజిబిజీగా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై 5 టీ20ల సిరీస్ ఆడనుంది. ఈనెల 23 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం అవుతుంది. తొలి మ్యాచ్ మన ఏపీలోనే జరగనుంది. విశాఖ వేదికగా భారత్-ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్ టిక్కెట్లను ఈనెల 15 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది.
Meg Lanning: మహిళా క్రికెట్లో ఆస్ట్రేలియాకు లెక్కలేనన్ని విజయాలు అందించిన ఏకైక కెప్టెన్ మెగ్ లానింగ్. అయితే ఆమె ప్రస్తుతం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
గ్లెన్ మ్యాక్స్‌వెల్.. ఇతడ్ని డేంజరస్ ఆటగాడిగా పరిగణిస్తుంటారు. అలా ఎందుకంటారో తాజాగా మరోసారి నిరూపితమైంది. త్వరగా వికెట్లు కోల్పోయి, తన ఆస్ట్రేలియా జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన అతగాడు..
ముంబై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్ బలమైన ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎదుర్కొని నిర్ణీత ఓవర్లు ఆడటంతో పాటు 5 వికెట్ల నష్టానికి 291 పరుగుల స్కోరు సాధించింది. ముఖ్యంగా ఓపెనర్ ఇబ్రహీం జాద్రాన్ చివరి వరకు క్రీజులో నిలబడి సెంచరీ సాధించడమే కాకుండా అజేయుడిగా నిలిచాడు.