Home » Australia
టీమిండియా మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు స్టార్ గ్రూప్‌తో పోటీ పడి హక్కులు దక్కించుకున్న జియో సినిమా వ్యూయర్ షిప్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఐపీఎల్ తరహాలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో జియో సినిమాను చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఇష్టపడుతున్నారు. అయితే తిరువనంతపురం వేదికగా ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ను ఏకంగా 15 కోట్ల మంది చూశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
IND Vs AUS: భారత్-ఆస్ట్రేలియా మధ్య ఆదివారం రెండో టీ20 జరగనుంది. అయితే కొన్ని రోజులుగా తిరువనంతపురంలో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం కూడా మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం ఉదయం వర్షం కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ.. మధ్యాహ్నం మాత్రం చిరుజల్లులు కురుస్తాయని తెలిపింది.
Team india: ఆస్ట్రేలియా మీడియా సంస్థకు చెందిన సోషల్ మీడియాలో టీమిండియాను అవమానపరుస్తూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. South Australia Man Gives Birth To World Record 11 Sons అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలో ప్రపంచకప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ట్రావిస్ హెడ్‌ను డెలవరీ రూంలో బెడ్‌పై పడుకున్న తల్లిగా చూపిస్తూ పిల్లలకు టీమిండియా క్రికెటర్ల ఫోటోలను మార్ఫింగ్ చేయడం వివాదానికి దారి తీసింది.
ఈ ఏడాది ఆస్ట్రేలియా అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండు ఐసీసీ ట్రోఫీలను సాధించింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌తో పాటు వన్డే ప్రపంచకప్ ట్రోఫీలను ఆస్ట్రేలియా తన ఖాతాలో వేసుకుంది. అయితే ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు నంబర్‌వన్ పొజిషన్లో ఒకరు కూడా లేరు. దీంతో నంబర్‌వన్ ర్యాంకులు లేకుండా నంబర్‌వన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను అందరూ ప్రశంసిస్తున్నారు.
FIR Registered Against Mitchell Marsh : భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ (World Cup) గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆసిస్ స్టార్ ఆటగాడు మిచెల్ మార్ష్ (Mitchell Marsh) ప్రపంచకప్ ట్రోఫిపై కాళ్లు పెట్టి మద్యపానం సేవిస్తూ దిగిన ఫోటో పెను సంచలనమైంది..
Australia: ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా ఒక్క ఏడాదిలో ఏకంగా మూడు కప్పులను కైవసం చేసుకుని గోల్డెన్ ఇయర్‌గా మార్చుకుంది. యాషెస్ సిరీస్‌ను నిలబెట్టుకోవడమే కాకుండా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లను కైవసం చేసుకుని ఈ ఏడాదిని ఆస్ట్రేలియా చిరస్మరణీయం చేసుకుంది.
ODI World Cup 2023: టీమిండియా అభిమానులు ఒకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది. దీంతో మూడోసారి వన్డే ప్రపంచకప్ విశ్వవిజేతగా నిలుస్తుందనుకున్న టీమిండియా తుది పోరులో దారుణ ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియా ఆరోసారి విజేతగా నిలిచి 2003 తరహాలో టీమిండియా ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది.
Marriage Sentiment: ప్రపంచకప్ ఫైనల్‌కు పెళ్లిళ్లతో ముడిపెట్టిన విశ్లేషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎందుకంటే పెళ్లిళ్లు చేసుకున్న కెప్టెన్లు మరుసటి ఏడాదే ప్రపంచకప్‌లను అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది పెళ్లి చేసుకున్న కెప్టెన్ ఈ ఏడాది ప్రపంచకప్ ట్రోఫీని అందుకుంటాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ODI World Cup: ఆదివారం నాడు అహ్మదాబాద్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య మెగా ఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరవుతున్నారు.
Astrologer Sumit Bajaj: వన్డే ప్రపంచకప్ తుది సమరానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. రెండు అత్యుత్తమ జట్లు ఆదివారం జరిగే ఫైనల్లో ఆడబోతున్నాయి. ఇటు భారత్, అటు ఆస్ట్రేలియా మరోసారి విశ్వవిజేతగా నిలవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ రెండు జట్లలో ఏ టీమ్ గెలుస్తుందోనని అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు. అయితే టీమిండియాదే ప్రపంచకప్ అని ఓ ప్రముఖ జ్యోతిష్యుడు స్పష్టం చేయడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.