Home » Bhatti Vikramarka Mallu
‘‘తెలంగాణ ప్రయోజనాల కోసమే పుట్టామని చెప్పుకొనే బీఆర్ఎస్ కేంద్రం వివక్షపై గట్టిగా మాట్లాడుతుందని ఆశించాం. కానీ, వారికి రాష్ట్ర ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని తేలింది.
ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఎడ్యుకేషన్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. డే స్కూల్ కాకుండా సెమీ అండ్ రెసిడెన్షియల్ పాఠశాలలు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని ప్రకటించారు.
రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజాగా అమలు చేసిన రైతు రుణమాఫీ సహా పలు అంశాలపై చర్చించారు. రుణమాఫీ మూడు దఫాలుగా ఇవ్వనున్నామని, మెదటి విడతలో భాగంగా రూ.6వేల కోట్లతో రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసినట్లు రాహుల్‌కు ముఖ్యమంత్రి తెలిపారు.
రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్(Central Minister CR Patil)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మూసీ నది డెవలప్మెంట్, రాష్ట్రంలోని ఇళ్లకు నల్లా కనెక్షన్ల కోసం పెద్దఎత్తున నిధులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరారు.
రాష్ట్రంలో ప్రతి ఏటా జూన్ నెలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసి, డిసెంబరులోపు నియామక ప్రక్రియలు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జాబ్ క్యాలెండర్‌పై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను డిసెంబరుకు వాయిదా వేశారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీజీపీఎస్సీ) శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపర్చడానికి త్వరలోనే విద్యా కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెల్లడించారు. అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలలు మొదలు విశ్వ విద్యాలయాల వరకు నాణ్యమైన...
మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) పేర్కొన్నారు.