Home » Chandrababu
ఉచిత ఇసుక విధానం జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి రానున్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్ నాగలక్ష్మి వివిధ శాఖల అధికారులతో చర్చించిన అనంతరం స్టాక్‌పాయింట్ల వద్ద లారీలో ఇసుక లోడింగ్‌కు మెట్రిక్ టన్నుకు రూ.250గా ధర నిర్ణయించారు.
సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు వచ్చారు. జూబ్లిహిల్స్‌లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు.
ఏపీ, తెలంగాణ సీఎంల సమావేశం ముగిసింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా జరిగిన సమావేశంలో సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డితో పాటు.. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్థన్ రెడ్డి, కందుల దుర్గేష్ పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిష్కారం కానీ సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి.. ఈ రోజు సాయంత్రం ప్రజాభవన్‌లో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్‌లో స్పందించారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా చిట్ చాట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదని ఆయన చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. సీఎంగా బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి హైదరాబాద్‌కు చంద్రబాబు వస్తున్నారు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలకాలని టీటీడీపీ నిర్ణయం తీసుకుంది.
తమిళనాట తెలుగు భాషను కాపాడుకునేందుకు పోరాడుతున్న తెలుగు యువశక్తి సంఘం అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి.. మాతృభాషాను కాపాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు సాయం అర్థించారు. ఏపీలో ఇంటర్మీడియట్ వరకూ అన్ని తరగతుల్లో తెలుగు మాధ్యమంలో బోధనను తక్షణం పునరుద్ధరించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అశోకా రోడ్డులోని 50వ నెంబర్ బంగ్లాకు చేరుకున్న ఆయన.. ఏపీ ఎన్డీఏ ఎంపీలతో విందులో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు (బుధవారం) దేశ రాజధాని ఢిల్లీ వెళ్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి హస్తినకు వెళ్తుండడంతో చంద్రబాబు పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర విభజన సమస్యలపై చర్చించడానికి లేఖ రాయడం సంతోషకర పరిణామమని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్‌ను ఏపీలో కలిపారన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్పగించారన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి చొరవ చూపాలని చంద్రబాబు అన్నారు.