Home » Chandrababu
ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కుంటుపడిన సంగతి తెలిసిందే. ఇటీవలే అధికారం చేపట్టిన ఎన్డీయే కూటమి ప్రభుత్వం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిలా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో చాటి చెప్పే విషయం ఒకటి వెలుగుచూసింది. ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. టీడీపీపీ (Telugu Desam Parliamentary Party) నేతల వివరాలను లేఖ ద్వారా స్పీకర్‌కు తెలిపారు. లావు శ్రీకృష్ణ దేవరాయలును టీడీపీపీ నేతగా గుర్తించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీడీపీ ఎంపీలతో బుధవారం చిట్‌చాట్ చేశారు. పార్లమెంట్ ఒక విశ్వవిద్యాలయం అని, పార్లమెంట్లో ఎంత ఎక్కువసేపు గడిపితే అంత ఎక్కువ నేర్చుకుంటారని ఎంపీలకు సూచించారు.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. గతంలో అధికారంలో ఉండగా ఆయన తన భద్రత కోసం తీసుకున్న చర్యలపై ప్రస్తుతం సర్వత్ర ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఓ ముఖ్యమంత్రిగా ఆయన అసాధారణ రీతిలో తన భద్రత కోసం చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం హోదాలో చంద్రబాబు తొలిసారి శనివారం మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వ్యక్తి పవన్ అని ప్రశంసల జల్లు కురిపించారు. పవన్‌ను అసెంబ్లీ గేటు తాకనీయబోమన్నారని, కానీ పవన్ పోటీ చేసిన 21 చోట్ల గెలిచారని చంద్రబాబు అన్నారు.
స్పీకర్‌గా అయ్యన్న పాత్రుడు ఎన్నిక తరువాత సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. అప్పట్లో పవన్ కల్యాణ్‌ను అసెంబ్లీ గేట్ కూడా తాక నివ్వనని వైసీపీ నేతలు చేసిన సవాల్‌ను గుర్తు చేశారు. జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిందని.. వైసిపి వాళ్ళు వై నాట్ 175 అని 11 గెలిచారన్నారు. గత సభ లాంటి సభను తాను ఎన్నడూ చూడలేదన్నారు.
ఇందుగలదు అందు లేదన్నట్లుగా.. వైసీపీ(YSRCP) ప్రభుత్వం హయాంలో ఏ శాఖలో చూసినా అవినీతే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh Government) ప్రభుత్వం మారిన తరువాత గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌పై ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమీక్షా సమావేశంలో ఈ అయిదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ విధ్వంసంలో అసలు సిసలు వాస్తవాలు వెలుగు చూసినట్లు తెలుస్తుంది.