Home » Chandrababu
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ యాదవ్‌కు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. ‘‘పార్టీకి ప్రభుత్వానికి మధ్య వారధి మీరే. మీ కష్టాన్ని చూసి రాష్ట్ర అధ్యక్షుడిగా కీలక బాధ్యతలిచ్చాం. సీనియర్ల సూచనలు, జూనియర్ల మద్దతుతో పార్టీలో యువరక్తాన్ని చేర్చండి’’ అని పల్లాకు సీఎం సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుని సందర్శించి సమీక్షి నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుకు సంబంధించిన కీలక వివరాలను వెల్లడించారు.
CM Chandrababu Naidu Vistis Polavaram: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
మోదీ ప్రభుత్వం తాజాగా కొలువు తీరింది. కేబినెట్ మంత్రులంతా బాధ్యతలు స్వీకరించారు. లోక్‌సభ స్పీకర్ ఎన్నిక ఒక్కటే ఇక మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆ పదవి.. ఏ పార్టీ వారిని వరించనుందనే అంశంపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు కూడా కాలేదు. అయినాసరే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రజాపాలనకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచే ఏపీ పాలనలో తనదైన మర్క్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు.
నటుడు సుమన్ తిరుమల శ్రీవారిని నేడు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు గుప్పించారు. ఏపీలో కూటమి ఘన విజయం సాధించడం శుభపరిణామమని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రం 5ఏళ్ళు వెన్నక్కి వెళ్ళిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్‌కు వెళ్లి.. నిర్మాణ పనులు స్వయంగా పరిశీలించాలని ఆయన నిర్ణయించారు.
ముఖ్యమంత్రి తర్వాత స్థానం ఎవరిదంటే.. డిప్యూటీ సీఎం ఉన్నా.. హోం శాఖ మంత్రిదేనన్నది సుస్పష్టం. చంద్రబాబు కేబినెట్లోని మంత్రులకు తాజాగా శాఖలు కేటాయించారు. ఈ నేపథ్యంలో వంగలపూడి అనితకు హోం శాఖను కేటాయించారు.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై చంద్రబాబు సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇన్నాళ్లూ నోటిఫికేషన్ల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన వారికి సీఎం చంద్రబాబు అధికారం చేపడుతూనే అభ్యర్థుల కళ్లలో ఆనందం నింపారు. తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పైనే పెట్టారు. ఇక ఇంతటితో అయిపోలేదు. ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు సైతం వెలువడేందుకు సమయం ఆసన్నమైంది.
పింఛన్ పథకానికి చంద్రబాబు ప్రభుత్వం పేరు మార్చింది. పింఛన్ పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా పేరు మార్చేసింది. ఈ పెన్షన్ల పెంపు అనేది వృద్ధులు, వితంతువులు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు, ట్రాన్స్ జెండర్లు వంటి వారికి వర్తించనుంది. రూ.3 వేలు ఉన్న పెన్షన్‌ను రూ.4 వేలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగుల పెన్షన్ అయితే రూ.3 వేల నుంచి ఏకంగా రూ.6 వేలకు పెంచింది.