Home » Chandrababu
వివిధ శాఖాధిపతుల హెచ్‌వోడీల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘ నాకు 1995లో సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్లు అంటే గౌరవం ఉండేది. కానీ గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థ గాడి తప్పింది’’ అని అన్నారు.
ఎక్కడా మాటతప్పమని చెప్పలేదు లేదు.. ఎక్కడా మడం తిప్పమని అనలేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలూసులు ఎత్తలేదు. అధికారంలోకి వస్తే ఏం చేస్తానో అదే చెప్పారు. ఎక్కడ డొంక తిరుగుడు లేదు. చేసేదే చెబుతానన్నారు. అంతా సూటిగానే చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) బాధ్యతలు స్వీకరించారు. తన ఛాంబర్లో వేద పండితుల ఆశీర్వచనాలు, దీవెనలతో బాధ్యతలు తీసుకున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రికి ఆలయ పండితులు, అధికారులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ పూర్ణకుంభ స్వాగతం పలికారు.
గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఉపయోగ పడే పనులు చతికిల పడ్డాయని మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. కేవలం చంద్రబాబుకి పేరు వస్తుందనే అహంకారంతో ముఖ్యమైన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదన్నారు. ఉద్యానవన పంటలకు సంబంధించిన అన్ని సబ్సీడీలను వైసీపీ ఆపేసిందన్నారు.
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశుని దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. శ్రీవారి ఆశీస్సుల కారణంగానే తమ కూటమి విజయం సాధించిందన్నారు. రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని.. 93 శాతం స్ట్రైక్ రేట్ గతంలో ఎప్పుడూ రాలేదన్నారు చంద్రబాబు.
ఎన్డీఏ ప్రభుత్వం ఏపీలో కొలువు దీరింది. ఇప్పటికే సీఎంగా చంద్రబాబు, ఇతర మంత్రుల ప్రమాణ స్వీకారాలు పూర్తయ్యాయి. ఒక రోజు అటో ఇటో సమావేశాలైతే నాలుగైదు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాల కోసం వివిధ పార్టీల కార్యాలయాలు ముస్తాబవుతున్నాయి. జనసేన పార్టీకి కొత్తగా జేఏఎస్ఎల్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2019 నుంచి టీడీఎల్పీ కేటాయించిన కార్యాలయాన్ని జేఎస్ఎల్పీకి కేటాయించడం జరిగింది.
అధికారం చేపట్టగానే ఏపీలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు పూనుకుంది. మద్యం కేసులో ఏపీ సీఐడీ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎం. లక్ష్మీనారాయణను నియమించింది. సీనియర్ కౌన్సిల్‌గా పోసాని వెంకటేశ్వర్లును నియమిస్తూ జీవో నంబర్ 578ను విడుదల చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జీవోను విడుదల చేసింది.
తిరుమల శ్రీవారిని సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. నిన్న ప్రమాణ స్వీకారానంతరం ఆయన తన కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లారు. అటు తరువాత వైకుంఠం ద్వారా చంద్రబాబు ఆలయంలోకి ప్రవేశించనున్నారు. సంప్రదాయ వస్త్ర ధారణతో చంద్రబాబు,లోకేష్,దేవాన్ష్ శ్రీవారి దర్శనానికి వచ్చారు.
విద్యార్థులకు వేసవి సెలవులు నిన్నటితో ముగిశాయి. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. జగనన్న విద్యాకానుక స్థానంలో ‘స్టూడెంట్ కిట్స్’ అందించనున్నారు. ఇంకా పాఠ్య పుస్తకాలు పూర్తిగా అందుబాటులోకి రాలేదు. వాస్తవానికి నిన్నటి నుంచే పాఠశాలలు ప్రారంభం కావాల్సి ఉంది.