Home » Chandrayaan 3
చంద్రుడిపై ల్యాండింగ్ ఒక కీలక ఘట్టం మాత్రమే. విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్ చేయాల్సింది చాలా ఉంది. ల్యాండర్ విక్రమ్ నుంచి బుధవారం వేరుపడిన ప్రజ్ఞాన్ రోవర్ పని మొదలుపెట్టింది. ఈ మేరకు గురువారం ఉదయం ఇస్రో (ISRO) ట్విటర్ వేదికగా కీలక అప్‌డేట్ ఇచ్చింది.
చంద్రయాన్-3 విజయవంతమవడంతో మన దేశ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. 2025 నాటికి మన దేశ రోదసి ఆర్థిక వ్యవస్థ విలువ 13 బిలియన్ డాలర్లు ఉండవచ్చునని అంచనా. స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు కూడా వస్తాయని చెప్తున్నారు.
చంద్రయాన్ మిషన్ ఇక్కడితో ఆగిపోయేది కాదు. చంద్రయాన్-3 తర్వాత చంద్రయాన్-4 ప్రయోగాన్ని కూడా ఇస్రో త్వరలో చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును జపాన్‌తో కలిసి భారత్ చేపడుతుందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు చంద్రయాన్-4 లేదా లుపెక్స్ అని నామకరణం చేసే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలియజేశాయి.
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 (Chandrayaan-3) ప్రయోగం విజయవంతం అయింది.ఈ మిషన్ సక్సెస్‌తో ప్రపంచ దేశాల ముందు ఇస్రో ఇండియాను గర్వపడేలా చేసింది. అయితే ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో తెలంగాణ యువకుడు కీలక పాత్ర పోషించారు.
చంద్రయాన్-3 సక్సెస్‌తో మన దేశంపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. రాజకీయ నేతలు, సినిమా స్టార్లు, క్రీడాకారులు కూడా విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఈ సందర్భంగా ఇస్రో సాధించిన విజయాన్ని ధోనీ కూడా కుటుంబ సమేతంగా సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే ధోనీ కుమార్తె స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
చంద్రయాన్-3 విజయవంతమైన తరుణంలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన లాంచ్ ప్యాడ్‌ను నిర్మించిన ఇంజినీర్లకు దాదాపు 17 నెలల నుంచి జీతాలు అందడం లేదని కొన్ని మీడియా సంస్థలు చెప్తున్నాయి. ఈ వార్తల్లో వాస్తవం ఏ మేరకు ఉందో తెలియడం లేదు.
అందాల చందమామను భారతీయులకు చేరువ చేసిన చంద్రయాన్-3 విజయం మధ్య తరగతి ప్రజలకు స్ఫూర్తిని, ప్రేరణను ఇస్తోంది.
యావత్ ప్రపంచం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూసిన చంద్రయాన్-3 దిగ్విజయమైంది. మరి ఇక్కడినుంచి ఏమిటి..? చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలిడిన అరుదైన ఘనతను మనకు అందించిన ల్యాండర్ విక్రమ్..
భూమిపై చంద్రోదయం అయ్యే వేళలో చంద్రుడిపై ఓ నవోదయం! భారత కీర్తిచంద్రికలు ఆచంద్రతారార్కం నిలిచే మహాద్భుత ఘట్టం! మానవుడే మహనీయుడై గ్రహరాశులనధిగమించి.. మన ‘ప్రజ్ఞాన్’ పాటవాలను విశ్వవ్యాప్తం చేసిన చారిత్రక సన్నివేశం!
చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మహోన్నత ఘట్టంతో దేశమంతా గర్విస్తోందన్నారు. భారతదేశ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించామని పేర్కొన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన మోదీ.. బుధవారం విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సురక్షితంగా దిగిన ఘట్టాన్ని