Home » Chittoor
Andhrapradesh: కలకత్తాలో కలకత్తాలో మహిళా ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు ఆందోళనలకు దిగారు. వైద్యురాలిపై జరిగిన దురాగతంపై తిరుపతి రుయా ఆస్పత్రిలో వైద్యులు ఓపీలు బాయికాట్ చేశారు. ఓపీలు లేదని తెలియక నెల్లూరు, చిత్తూరు, కడప, అన్నమయ్య జిల్లాల నుంచి తిరుపతి రుయా ఆసుపత్రికి వందలాది మంది రోగులు తరలివచ్చారు.
తిరుపతి: తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు బుధవారం అంకురార్పణ జరగనుంది. ఇవాళ సాయంత్రం శ్రీవారి ఆలయంలో అర్చకులు అంకురార్పణ కార్యక్రమాని నిర్వహించనున్నారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో అర్చకులు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారు.
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ ఉభయ దారుల సమావేశం ఆదివారం నాడు జరిగింది. అయితే ఈ సమావేశం రసాభాసగా మారింది. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 21 రోజుల పాటు కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
స్టాక్ పాయింట్ల వరకు ఇసుక రవాణా.. అక్కడ లోడింగ్‌కు మాత్రం డబ్బు చెల్లించాలి. జిల్లా స్థాయి ఇసుక కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్ సుమిత్ కుమార్ దీనికి సంబంధించిన విధివిధానాలను ప్రకటించారు.
Andhrapradesh: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శించుకుని భక్తులు పరవశించిపోతుంటారు. ఒక్కసారైనా ఆ శ్రీనివాసుడిని దర్శించుకోవాలని తహతహలాడుతుంటారు. అలాగే తిరుమలలో నిత్యం ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం తిరుమలలో పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఇందు కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది.
Andhrapradesh: వివాహ బంధాలను కొందరు కాల రాస్తున్నారు. పెళ్లిలో చేసిన ప్రమాణాలకు తూట్లు పొడుస్తున్నారు. భార్య ఉండగానే మరో పెళ్లికి సిద్ధమైపోతున్నారు ప్రబుద్ధులు. మొదటి భార్యకు తెలియకుండానే రెండో పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే విషయం తెలిసిన మొదటి భార్యలు.. భర్తలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడమే కాకుండా గుణపాఠం చెబుతుంటారు.
డాయ్ ట్రేడింగ్ యాప్(DAAI Trading App)లో అమాయకుల నుంచి రూ.6కోట్లు పెట్టుబడి పెట్టించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ విష్ణు రఘువీర్ వెల్లడించారు. పలమనేరు మెప్మా కార్యాలయంలో పని చేస్తున్న రాజేశ్(A3) వందల మందిని నమ్మించి ట్రేడింగ్ యాప్‌లో నగదు పెట్టించారని ఆయన తెలిపారు.
ఉపాధి కోసం అరబ్ దేశానికి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళకు సాయం అందింది. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం తుర్కపల్లె గ్రామానికి చెందిన షేక్ హసీనా అనే యువతి గల్ఫ్ దేశంలో సాయం కోసం చూసింది. తనను రక్షించాలని మంత్రి నారా లోకేశ్‌కు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. లోకేష్ పిలుపు మేరకు సౌదీ అరేబియాలో ఏపీ ఎన్ఆర్ఐ ప్రతినిధి స్పందించారు.
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు సీఐడీకి అప్పగించింది. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమలరావు (DGP Dwaraka Tirumala Rao) జారీ చేశారు. రెండ్రోజుల్లో కేసు మొత్తాన్ని సీఐడీకి మదనపల్లె పోలీసులు అప్పగించనున్నారు.
Andhrapradesh: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి బృందంతో కూడిన టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. ఆవులపల్లి ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై రైతులతో క్షేత్రస్థాయి పర్యటనలో ముఖాముఖి నిర్వహించనున్నారు. పెద్దిరెడ్డి అవినీతి అక్రమాలపై పుంగనూరులో మంత్రి ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.