Home » Chittoor
కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ(Bhupathiraju Srinivasa Varma) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ మర్యాదలతో కేంద్రమంత్రికి అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం శ్రీనివాసవర్మ మీడియాతో మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల హామీల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉద్ఘాటించారు. మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Andhrapradesh: తిరుత్తణిలో టీటీడీ భూమి అన్యాక్రాంతంపై చర్యలు తీసుకుంటామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జూలై మాసంలో శ్రీవారిని 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని తెలిపారు. హుండీ ద్వారా శ్రీవారికీ రూ.125కోట్ల 35లక్షలను భక్తులు కానుకల రూపంలో సమర్పించారన్నారు. కోటి నాలుగు లక్షల లడ్డులను భక్తులకు విక్రయించామని... 24.04 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాని స్వీకరించారని వెల్లడించారు అలాగే 8.67 లక్షల మంది భక్తులు తలనీలలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలిపారు.
ప్రాజెక్టు కట్టేందుకు ఎటువంటి అనుమతులూ లేవు.. అయినా అడ్డగోలుగా కట్టేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని.. పోలీసులతో భయపెట్టి.. మూడు కార్తెలు పండే తల్లిలాంటి భూములు లాక్కున్నారు. పైసా పరిహారం ఇవ్వకుండానే.. దౌర్జన్యంగా పట్టాదార్ పాస్‌పుస్తకాలూ తీసేసుకున్నారు.
మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై (Madanapalli fire incident) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు.
Andhrapradesh: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాయలంలో అగ్నిప్రమాదం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఘటన జరిగిన తరువాత నిర్లక్ష్యంగా వ్యవహరించిన కొంతమంది పోలీస్, రెవిన్యూ అధికారులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే కలెక్టర్‌కు ఆర్డీవో సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జిల్లా ఫైర్ ఆఫీసర్ ద్వారా సమాచారం తెలుసుకున్న కలెక్టర్ వెంటనే అక్కడికి చేరుకున్నారు.
అమరావతి: ఏపీ శాసనమండలి సమావేశాలు రెండో రోజు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా తిరుమల అవినీతిపై చర్చ ప్రారంభమైంది. పరకామణిలో భారీ స్థాయిలో దోపిడీ జరిగిందని ఎమ్మెల్యే రామగోపాల్ రెడ్డి ఆరోపించారు.
Andhrapradesh: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. పోలీసులు10 ప్రత్యేక బృందాలుగా విడిపోయి విచారణలు చేపట్టారు. ఒక్కో బృందంలో టీం లీడర్‌గా డీఎస్సీ స్థాయి అధికారి ఉన్నారు. మదనపల్లి రెవిన్యూ డివిజన్‌కు సంబంధించి మొత్తం 11 మండలాల్లోని తాసిల్దార్ కార్యాలయాల్లో డిప్యూటీ తాసిల్దార్ల పర్యవేక్షణలో రికార్డుల తనిఖీలు చేపట్టారు.
Andhrapradesh: మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన చోట అడిషనల్ ఎస్పీ రాజకుమార్ సీన్‌ను రీ కన్స్ట్రక్షన్ చేశారు. మదనపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలోని 11 మండలాల తహసిల్దార్ కార్యాలయాలల్లో సోమవారం అర్ధరాత్రి వరకు ప్రత్యేక బృందాల తనిఖీలు నిర్వహించాయి. 22 ఏ ఫైల్స్ అన్నింటినీ కూడా ప్రత్యేక అధికారులు సీజ్ చేసి తీసుకెళ్లారు.
Andhrapradesh: అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం ఘటనపై ప్రభుత్వ అత్యవసర విచారణకు ఆదేశించింది. అగ్నిప్రమాదంలో కీలక ఫైల్స్ దగ్ధం అయ్యాయని సమాచారం. నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి కొన్ని గంటల ముందు జరిగిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదమా?.. కుట్ర పూరితమా? అనే అంశంలో విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.